Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్-కొరటాల సినిమాపై మరో రూమర్

ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమాపై కొత్త రూమర్ వచ్చింది. ఈసారి శ్రీలీల పేరు తెరపైకొచ్చింది.

ఎన్టీఆర్-కొరటాల సినిమాపై మరో రూమర్
X

ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై పుకార్ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్టుపై గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోటి తెరపైకొచ్చింది. ఈసారి సెకెండ్ హీరోయిన్ అంశం.

అవును.. ఎన్టీఆర్, కొరటాల సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా శ్రీలీల ను తీసుకున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారట. ఓవైపు సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో తెలియక అభిమానులు ఇబ్బంది పడుతుంటే, ఇలా సెకెండ్ హీరోయిన్ అంటూ కొత్త పుకారు రావడం యూనిట్ ను ఇబ్బంది పెడుతోంది.

నిజానికి ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ముందు అలియాభట్ అనుకున్నారు, ఆ తర్వాత కియరా అద్వానీ పేరు వినిపించింది. తాజాగా రష్మిక, పూజా హెగ్డే పేర్సు కూడా తెరపైకొచ్చాయి. ఇదింకా ఫైనలైజ్ అవ్వకముందే, సెకెండ్ హీరోయిన్ అంటూ శ్రీలీల పేరు తెరపైకొచ్చింది.

ప్రస్తుతానికైతే ఎన్టీఆర్, బరువు తగ్గే పనిలో బిజీగా ఉన్నాడు. కొరటాల సినిమా కోసం కనీసం 8 కిలోలు తగ్గాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఎన్టీఆర్ అనుకున్న ఫిజిక్ సాధించిన వెంటనే సినిమా సెట్స్ పైకి వస్తుంది.

First Published:  10 Oct 2022 4:42 AM GMT
Next Story