Telugu Global
Cinema & Entertainment

Waltair Veerayya: మెగా మాస్ సాంగ్ వస్తోంది

Waltair Veerayya's Mega Mass song: మెగాస్టార్ హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా నుంచి మరో మాస్ సాంగ్ రాబోతోంది. ఈసారి పూనకాలు లోడింగ్ అంటోంది యూనిట్.

Waltair Veerayya: మెగా మాస్ సాంగ్ వస్తోంది
X

చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ఇప్పటికే 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. వీటిలో మెలొడీ సాంగ్ ను పక్కనపెడితే.. మిగతా 2 పాటలు ఊపునిచ్చే పాటలే. మరీ ముఖ్యంగా బాస్ పార్టీ సాంగ్ దుమ్ముదులుపుతోంది.

దీంతో వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ సాంగ్ కోటా అయిపోయిందని చాలామంది అనుకుంటున్నారు. కానీ అసలు మేటర్ ఇంకా ఉందంటోంది యూనిట్. వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీకి మించిన మాస్ సాంగ్ ఉందంటోంది యూనిట్. ఆ పాటను రేపు రిలీజ్ చేయబోతున్నారు.

సినిమాలో చిరంజీవి-రవితేజ కలిసి చేసిన సాంగ్ ఒకటి ఉందంట. ఆ సాంగ్ ను రేపు విడుదల చేస్తారట. అది కూడా అభిమానుల సమక్షంలో సంధ్య థియేటర్ లో ఆ పాటను విడుదల చేయబోతున్నారు.

ఈ పాటతో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకుంటాయి. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు బాబి దర్శకత్వం వహించాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న వాల్తేరు వీరయ్య థియేటర్లలోకి రాబోతోంది.

First Published:  29 Dec 2022 6:30 AM GMT
Next Story