Telugu Global
Cinema & Entertainment

మరో ఘోస్ట్ వస్తున్నాడు

నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా తాజాగా థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడుమరో ఘోస్ట్ వస్తున్నాడు. ఇంతకీ ఎవరా ఘోస్ట్..

మరో ఘోస్ట్ వస్తున్నాడు
X

రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది ది ఘోస్ట్ సినిమా. నాగార్జున హీరోగా నటించిన ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు అదే టైటిల్ తో మరో సినిమా వస్తోంది. అయితే ఇది తెలుగు సినిమా కాదు. ఇదొక డబ్బింగ్ మూవీ.

శివరాజ్ కుమార్ పాన్ ఇండియా ఫిలిం 'ఘోస్ట్' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కి కన్నడ బ్లాక్ బస్టర్ 'బీర్బల్' చిత్ర దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తుండగా, సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సందేశ్ నాగరాజ్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఘోస్ట్ చిత్ర బృందం కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. గాల్లోకి ఎగురుతున్న బుల్లెట్ల మధ్య గన్ పట్టుకున్న శివరాజ్ కుమార్, వెనక ఫైర్-స్మోక్ ఎఫెక్ట్ బ్యాక్ డ్రాప్ తో పోస్టర్ ఆకట్టుకుంటోంది .

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో 6 కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటుచేసిన భారీ జైలు సెట్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక్కడ 24 రోజుల పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేయనున్నారు. నవంబర్ 10 కి మొదటి షెడ్యుల్ పూర్తవుతుంది. డిసెంబర్ లో రెండో షెడ్యుల్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది.




First Published:  24 Oct 2022 11:27 AM GMT
Next Story