Telugu Global
Cinema & Entertainment

స్వప్న సినిమాస్ నుంచి మరో మూవీ

సంతోష్ శోభన్ హీరోగా మరో సినిమా రెడీ అయింది. దీని పేరు 'అన్నీ మంచి శకునములే'. తాజాగా విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

స్వప్న సినిమాస్ నుంచి మరో మూవీ
X

రీసెంట్ గా స్వప్న సినిమాస్ నుంచి సీతారామం మూవీ వచ్చింది. అది ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. థియేట్రికల్ రన్ ముగించుకొని, ఓటీటీలోకి కూడా వచ్చింది ఆ మూవీ. అలా సీతారామం సక్సెస్ ను పూర్తిగా ఎంజాయ్ చేసిన నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్.. ఇప్పుడు తమ కొత్త సినిమాపై ఫోకస్ పెట్టారు.

సంతోష్ శోభన్ హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అన్నీ మంచి శకునములే'. టైటిల్ కి తగ్గట్టే సినిమాపై మంచి పాజిటివ్ బజ్ ఉంది. దీంతో రిలీజ్ డేట్ ప్రకటించారు. 'అన్నీ మంచి శకునములే' డిసెంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమాకి క్రిస్మస్ వీకెండ్ పెద్ద అడ్వాంటేజ్ అవ్వనుంది. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ కు జోడీగా మాళవిక నాయర్ కనిపించనుంది. ప్రియాంక దత్ , మిత్ర విందా మూవీస్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్, రాజేంద్ర ప్రసాద్, గౌతమి లాంటి సీనియర్ ఆర్టిస్టులు నటించారు. మంచి కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై కూడా ప్రియాంక దత్ చాలా నమ్మకంతో ఉంది.

First Published:  5 Oct 2022 4:59 AM GMT
Next Story