Telugu Global
Cinema & Entertainment

Anni Manchi Sakunamule - అన్నీ మంచి శకునములే టీజర్ రివ్యూ

Anni Manchi Sakunamule - సంతోష్ శోభన్ కొత్త సినిమా అన్నీ మంచి శకునములే. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

Anni Manchi Sakunamule - అన్నీ మంచి శకునములే టీజర్ రివ్యూ
X

సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘అన్నీ మంచి శకునములే’. నందినీరెడ్డి దర్శకత్వంలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కింది ఈ మూవీ. తాజాగా ఈ సినిమా టీజర్ లాంఛ్ అయింది. సీతారామం స్టార్ దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా విడుదలైన ఈ టీజర్ ఎలా ఉందో చూద్దాం..

రెండు విభిన్నమైన, సంతోషకరమైన కుటుంబాలను, వారి మధ్య అందమైన బంధాన్ని టీజర్ పరిచయం చేస్తుంది. 76 సెకన్ల వీడియోలో అన్ని రకాల ఎమోషన్స్ చూపించారు. హిల్ ఏరియా నేపథ్యంలో సాగే కథ ఇది. విజువల్స్ అందంగా ఉన్నాయి. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ పెయిర్ చాలా బాగుంది. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి.. ఇలా టీజర్ లో అందర్నీ చూపించారు.

Advertisement

సన్నీ కూరపాటి కెమెరా వర్క్, మిక్కీ జె మేయర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ బాగున్నాయి. ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే విషయం టీజర్ చూస్తే తెలుస్తోంది.

మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దావూద్ స్క్రీన్ ప్లే అందించగా, లక్ష్మీ భూపాల మాటలు అందించారు. సమ్మర్‌లో మే 18న సినిమాను విడుదల చేస్తారు.



Next Story