Telugu Global
Cinema & Entertainment

Japan Movie | 'అన్నపూర్ణ' చేతికి జపాన్

Japan Movie - కార్తి హీరోగా నటించిన సినిమా జపాన్. ఈ సినిమా తెలుగు రైట్స్ ను నాగార్జున దక్కించుకున్నారు.

Japan Movie | అన్నపూర్ణ చేతికి జపాన్
X

వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో కార్తి, కెరీర్ లో 25వ చిత్రానికి వచ్చాడు. ఇది అతడికి మైల్ స్టోన్ మూవీ కాబోతోంది. అదే జపాన్ సినిమా. జోకర్ మూవీ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హైస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు.

'జపాన్‌' దీపావళికి విడుదలవుతుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు హక్కులను ఫ్యాన్సీ రేటుకి దక్కించుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాజెక్ట్ లోకి రావడంతో సినిమా గ్రాండ్ గా భారీ ఎత్తున విడుదల కానుంది.

కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఒక అజ్ఞాత వ్యక్తి 200 కోట్ల దోపిడీకి పాల్పడే కథాంశంతో ఈ సినిమా రాబోతోందనే విషయం టీజర్ తో తెలిసింది. సినిమాలో డిఫరెంట్ మేకోవర్‌ తో పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాడు కార్తి.

కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సునీల్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ ఈ సినిమాతో తొలిసారిగా నటుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ రవి వర్మన్ టీజర్ లో క్యాప్చర్ చేసిన ఫ్రేమ్‌లు బ్రిలియంట్ గా ఉండగా, జివి ప్రకాష్ కుమార్ తన బిజిఎమ్‌తో వాటిని మరింత ఎలివేట్ చేశాడు.

First Published:  22 Oct 2023 12:31 PM GMT
Next Story