Telugu Global
Cinema & Entertainment

Geethanjali | గీతాంజలి న్యూ ఇయర్ పోస్టర్ అదిరింది.

Geethanjali Malli Vachindi - అంజలి లీడ్ రోల్ పోషిస్తున్న సీక్వెల్ మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ వచ్చింది.

Geethanjali | గీతాంజలి న్యూ ఇయర్ పోస్టర్ అదిరింది.
X

హీరోయిన్ అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. మలయాళ నటుడు రాహుల్ మాధవ్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

అంజ‌లి న‌టిస్తోన్న‌ 50వ సినిమా ఇది. హారర్ కామెడీ జోనర్ లో ట్రెండ్ సెట్ చేసిన గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్.

‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. కొత్త ఏడాది 2024 ప్రారంభం సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ మేకర్స్ ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

పాడుబడ్డ భవంతిలో నాట్య కళాకారిణి లుక్‌లో అంజలి కనిపిస్తోంది. ఓ వైపు అంజలి లుక్.. మరో వైపు భవంతి బ్యాక్ డ్రాప్ చూస్తుంటే సరికొత్త కథ, కథనంతో ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమైందని తెలుస్తోంది.

భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ‘గీతాంజ‌లి మ‌ళ్ళీ వ‌చ్చింది’ చిత్రాన్ని మేక‌ర్స్ తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. ‘గీతాంజలి’ సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే సీక్వెల్ స్టార్ట్ అవుతుంది.

First Published:  1 Jan 2024 4:15 PM GMT
Next Story