Telugu Global
Cinema & Entertainment

అనిరుధ్ పాడిన మరో తెలుగు పాట విన్నారా?

ఓరి దేవుడా సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజైంది. తమిళ స్టార్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ ఈ పాటను ఆలపించాడు. ఆ సాంగ్ ఎలా ఉందో మీరూ చూడండి.

Ori Devuda Movie Song
X

విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం 'ఓరి దేవుడా'. ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి. బ్యానర్ పై ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వ‌త్ మారిముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. స్టార్ హీరో వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 21న విడుద‌ల చేస్తున్నారు.

రీసెంట్‌గా విడుదలైన ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి 'గుండెల్లోన..' అనే బ్యూటీఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. కోలీవుడ్ యంగ్ మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ ఈ పాటను పాడటం విశేషం. ట్యూన్, దానికి తగ్గ లిరిక్స్‌తో పాట విన‌సొంపుగా ఉంది.

అనిరుధ్ త‌నదైన వాయిస్‌తో ఈ పాట‌ను పాడి దానికి మ‌రింత అందాన్ని తీసుకొచ్చాడు. పాట‌లో విశ్వ‌క్ సేన్‌, ఆశా భ‌ట్ మ‌ధ్య బ్యూటీఫుల్ కెమిస్ట్రీ క‌నిపిస్తుంది. వాన పాట థీమ్ కు తగ్గట్టు మంచి స్టెప్పులు కంపోజ్ చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం చాలా బాగుంది.

స్టార్ హీరో వెంక‌టేష్ 'ఓరి దేవుడా' చిత్రంలో స్టైలిష్ దేవుడిలా క‌నిపించ‌నున్నాడు. రాహుల్ రామ‌కృష్ణ‌, ముర‌ళీ శ‌ర్మ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా థియేటర్లలోకి వస్తోంది.



First Published:  12 Oct 2022 12:04 PM GMT
Next Story