Telugu Global
Cinema & Entertainment

Animal | మళ్లీ పెరిగిన యానిమల్ రన్ టైమ్

Animal - యానిమల్ సినిమా నిడివి ఇప్పటికే చాలా ఎక్కువ. ఇప్పుడీ సినిమా ఓటీటీ వెర్షన్ నిడివి ఇంకా పెరగబోతోంది.

Animal Movie Trailer Review | రణబీర్ కపూర్ యానిమల్ ట్రయిలర్ ఎలా ఉందంటే..!
X

చాలా భారీ రన్ టైమ్ తో యానిమల్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దీని ఓటీటీ వెర్షన్ ఇంకా ఎక్కువ రన్ టైమ్ తో ఉంటుందంటూ కథనాలు వచ్చాయి. దాదాపు 20 నిమిషాలు ఎక్కువగా ఓటీటీ వెర్షన్ ఉంటుందని అంతా అనుకున్నారు. దీనిపై సందీప్ రెడ్డి వంగ క్లారిటీ ఇచ్చాడు.

యానిమల్ ఓటీటీ వెర్షన్ రెడీగా ఉంది. అంతా అనుకున్నట్టు థియేట్రికల్ రన్ టైమ్ కంటే, ఓటీటీ నిడివి కాస్త పెద్దదే. అయితే 20 నిమిషాలు కాదు, థియేట్రికల్ వెర్షన్ కంటే, 9 నిమిషాలు ఎక్కువగా ఓటీటీలో యానిమల్ నిడివి ఉండబోతోంది. ఈ మేరకు సందీప్ వంగ అధికారిక ప్రకటన చేశాడు.

ప్రస్తుతం తన తాజా చిత్రం 'యానిమల్' విజయాన్ని ఆస్వాదిస్తున్న సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ నటించిన చిత్రం థియేట్రికల్ వెర్షన్‌లో లోపాలను వెల్లడించాడు. చిత్రం యొక్క OTT వెర్షన్‌కు కొన్ని అదనపు షాట్‌లను జోడించే అవకాశాన్ని అతను చర్చించాడు. అలా రన్‌టైమ్ పెరిగిందని చెప్పుకొచ్చాడు.

రణబీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది యానిమల్ సినిమా. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ వెర్షన్ పనిలో వంగ బిజీగా ఉన్నాడు.

First Published:  24 Dec 2023 3:57 PM GMT
Next Story