Telugu Global
Cinema & Entertainment

NBK108: బాలకృష్ణ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?

Balakrishna heroine - అనీల్ రావిపూడి, బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఈరోజు ఈ విషయం తేలనుంది.

NBK108: బాలకృష్ణ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
X

ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ ఆల్రెడీ పూర్తయింది. ఫిబ్రవరి మొదటి వారంలో సెకెండ్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది.

అయితే ఈ గ్యాప్ లో అనీల్ రావిపూడికి ఓ పని పడింది. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక ఇంకా పూర్తికాలేదు. సినిమాలో శ్రీలీల నటిస్తోంది కానీ ఆమె హీరోయిన్ కాదు. బాలకృష్ణకు కూతురి పాత్రలో ఆమె కనిపించనుంది. బాలయ్య సరసన హీరోయిన్ బెర్త్ అలానే ఖాళీగా ఉంది.

ఇప్పుడా బెర్త్ ను నింపాల్సిన బాధ్యత అనీల్ రావిపూడిపై పడింది. మరీ ముఖ్యంగా సెకెండ్ షెడ్యూల్ నాటికి బాలయ్య సినిమాలో హీరోయిన్ ను లాక్ చేయాలి.

బాలయ్య సినిమాలో ఎవరు పడితే వాళ్లను హీరోయిన్ గా తీసుకోవడానికి కుదరదు. ఎందుకంటే, హీరోయిన్లంతా వయసులో చిన్నవాళ్లు, బాలయ్య వయసులో చాలా పెద్ద. ఇమేజ్ కూడా పెద్దది. అలాంటి నటుడి పక్కన హీరోయిన్ ను వెదకడం కాస్త కష్టమైన పనే.

ఆ పనిని త్వరగానే పూర్తిచేశాడు అనీల్ రావిపూడి. బాలయ్య సినిమాలో హీరోయిన్ ను లాక్ చేశాడు. మరికొన్ని గంటల్లో ఆ హీరోయిన్ ఎవరనే విషయం బయటకొస్తుంది. ఆ వెంటనే సెకెండ్ షెడ్యూల్ డీటెయిల్స్ కూడా బయటకొస్తాయి.

First Published:  24 Jan 2023 4:51 AM GMT
Next Story