Telugu Global
Cinema & Entertainment

Anil Ravipudi: నా సినిమాలో బాలయ్యది సింగిల్ రోల్

Anil Ravipudi-Balakrishna: త్వరలోనే బాలయ్యను డైరక్ట్ చేయబోతున్నాడు అనీల్ రావిపూడి. ఆ సినిమాలో బాలయ్యది ద్విపాత్రాభినయం అనే టాక్ ఉంది. దీనిపై దర్శకుడు ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

Anil Ravipudi: నా సినిమాలో బాలయ్యది సింగిల్ రోల్
X

ఈమధ్య బాలయ్య ఏ సినిమా చేసినా అందులో రెండు గెటప్స్ లేదా రెండు షేడ్స్ కామన్ గా కనిపిస్తున్నాయి. ఆమాత్రం వెయిట్ లేకపోతే బాలయ్యతో సినిమా కష్టం అనే రేంజ్ కు వచ్చేశారు దర్శకులు. దీంతో అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా రాబోతున్న సినిమాలో కూడా ఈ హీరో రెండు గెటప్స్ లో కనిపిస్తాడనే ప్రచారం ఊపందుకుంది.

ఈ ప్రచారాన్ని దర్శకుడు అనీల్ రావిపూడి తిప్పికొట్టాడు. తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో సరదాగా మాట్లాడిన అనీల్ రావిపూడి, తన తాజా చిత్రంలో బాలయ్య సింగిల్ క్యారెక్టర్ లోనే కనిపిస్తారని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా మరిన్ని విషయాల్ని పంచుకున్నాడు.

అనీల్ రావిపూడి సినిమాలో బాలయ్య తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇంతకుముందు అనుకున్నట్టు ఔట్ అండ్ ఔట్ సీరియస్ సబ్జెక్ట్ గా కాకుండా, కాస్త ఫన్ కూడా యాడ్ చేశాడట రావిపూడి. అయితే బాలయ్య కామెడీ చేయరని, సందర్భానుసారం కామెడీ పుడుతుందని క్లారిటీ ఇచ్చాడు.

అలా బాలయ్య సినిమాలో దాదాపు 40శాతం కామెడీ ఉంటుందని స్పష్టం చేశాడు అనీల్ రావిపూడి. దర్శకులంతా బాలయ్యను ఓ విధంగా చూపించారని, తను వాళ్లకు భిన్నంగా కొత్తగా బాలయ్యను ప్రజెంట్ చేయబోతున్నట్టు తెలిపాడు. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల, బాలయ్యకు కూతురుగా కనిపించనుంది.

First Published:  24 Nov 2022 2:41 PM GMT
Next Story