Telugu Global
Cinema & Entertainment

Anikha Surendran: బుట్టబొమ్మ ఒప్పుకోవడానికి కారణం చెప్పిన అనిక

Anikha Surendran Butta Bomma - టాప్ ఛైల్డ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న అనిక సురేంద్రన్, ఇప్పుడు హీరోయిన్ గా మారింది. బుట్టబొమ్మ సినిమాలో నటించింది.

Anikha Surendran: బుట్టబొమ్మ ఒప్పుకోవడానికి కారణం చెప్పిన అనిక
X

అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం బుట్టబొమ్మ. ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 4న భారీస్థాయిలో థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమాకు మరో స్పెషాలిటీ కూడా ఉంది. ఎన్నో ఏళ్లుగా బాలనటిగా మెప్పిస్తున్న అనిక సురేంద్రన్, ఈ సినిమాతో హీరోయిన్ గా మారింది. అజిత్ కు ఆన్ స్క్రీన్ కూతురిగా గుర్తింపు పొందిన ఈ బాలనటి, ఈమధ్య నాగార్జున చేసిన ది ఘోస్ట్ లో కూడా నటించింది. ఇప్పుడు బుట్టబొమ్మతో హీరోయిన్ గా మారింది. ఈ సినిమాతోనే హీరోయిన్ గా మారడానికి రీజన్ చెబుతోంది అనిక.

"ఎన్నో ఏళ్లుగా బాలనటిగా సినిమాల్లో నటిస్తూ వచ్చాను. ఇప్పుడిలా హీరోయిన్ గా నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. కప్పేల మలయాళ వెర్షన్ చూశాను.. చాలా నచ్చింది. ఇంతలోనే ఆ ఫిల్మ్ రీమేక్ లో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం ఆనందం కలిగించింది. ఆ పాత్రలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి, నటనకు ఆస్కారం ఉంది. అందుకే కప్పేల రీమేక్ బుట్టబొమ్మతో హీరోయిన్ గా మారడానికి అంగీకరించాను."

బాలనటిగా నటించినప్పుడు బాధ్యత ఉండదని, సినిమా రిజల్ట్ తో సంబంధం ఉండదని చెబుతున్న అనిక, హీరోయిన్ గా నటించినప్పుడు మాత్రం చాలా పెద్ద బాధ్యత ఉంటుందని చెబుతోంది. మరీ ముఖ్యంగా రీమేక్ లో నటించేటప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలంటోంది.

First Published:  21 Jan 2023 1:06 PM GMT
Next Story