Telugu Global
Cinema & Entertainment

Andrea Jeremaiah - నో ఎంట్రీ అంటున్న హీరోయిన్ ఆండ్రియా

Andrea Jeremaiah's No entry Movie - ఆండ్రియా లీడ్ రోల్ పోషించిన సినిమా నో ఎంట్రీ. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది.

Andrea Jeremaiah - నో ఎంట్రీ అంటున్న హీరోయిన్ ఆండ్రియా
X

కోలీవుడ్‌ మల్టీ టాలెంటెడ్‌ హీరోయిన్స్‌లో ఆండ్రియా ఒక‌రు. ఆమె ఇప్పటివరకు ఫ్యామిలీ, లవ్, కామెడీ చిత్రాల్లో నటించింది. అయితే ఈసారి ఆండ్రియా యాక్షన్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. అటవీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ‘నో ఎంట్రీ’ చిత్రంలో ఆమె సరికొత్త పాత్రలో నటిస్తోంది. తాజాగా `నో ఎంట్రీ` మూవీ ట్రైల‌ర్‌ని రిలీజ్ చేశారు మేక‌ర్స్‌..

ట్రైల‌ర్‌ని గ‌మ‌నిస్తే..దట్టమైన అటవీ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్ళిన కొంతమంది స్నేహితులు అడవిలోని కొండ శిఖరంలో ఉన్న లగ్జరీ విల్లాలో బస చేస్తారు. ఆ ఇంటిని క్రూరమైన అడవి కుక్కలు చుట్టుముడతాయి. ఆ కుక్కల భారీ నుండి వారు ఏ విధంగా తప్పించుకున్నారన్నదే ఈ సినిమా కథ.

ఎంతో రిచ్ గా, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా ఇందులోని సన్నివేశాలను తెరకెక్కించినట్టు దర్శకుడు వెల్లడించారు. జంబో సినిమాస్‌ బ్యానరులో శ్రీధర్ అరుణాచ‌లం ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల‌కానుంది.

ఆండ్రియాకు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె నటించిన సినిమాలు తెలుగులో కూడా గుర్తింపు పొందాయి. ఇక సింగర్ గా కూడా ఆమె చాలామందికి పరిచయం. ఆ క్రేజ్ తో నో ఎంట్రీ సినిమాకు మంచి బజ్ వస్తుందని ఆశిస్తున్నారు మేకర్స్.



First Published:  25 Feb 2023 12:19 PM GMT
Next Story