Telugu Global
Cinema & Entertainment

Ari Movie - ఇంట్రెస్టింగ్ ట్రయిలర్

Ari Movie - అనసూయ, సాయికుమార్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా అరి. ఈ సినిమా ట్రయిలర్ తాజాగా రిలీజైంది.

Ari Movie - ఇంట్రెస్టింగ్ ట్రయిలర్
X

ఈ మధ్య కాలంలో తెలుగులో చాలా కాన్సెప్ట్ సినిమాలొస్తున్నాయి. ఈ క్రమంలో మరో కాన్సెప్ట్ మూవీ రెడీ అయింది. దాని పేరు అరి. తాజాగా రిలీజైన ఈ సినిమా ట్రయిలర్ చూస్తే, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుందనే విషయం అర్థమౌతుంది.

ఆరి ప్రతి ఒక్కరి కోరికలను తీర్చడానికి ప్రతిజ్ఞ చేసే ఓ ఏజెన్సీ. ఇది అనసూయ, సాయి కుమార్, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి, శుభలేక సుధాకర్ లాంటి వాళ్ల వద్దకు తన కథను తీసుకెళ్తుంది. అయితే ఇది నేరుగా కోరికలు తీర్చదు. దానికి బదులుగా, మరికొన్ని పనులు చేయాలని ప్రేరేపిస్తుంది. ట్రయిలర్ లో ఈ కాన్సెప్ట్ ను క్లియర్ గా చెప్పారు.

ట్రైలర్‌లో ఆసక్తి రేకెత్తించే సన్నివేశాలు పెట్టారు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఈ సరికొత్త, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ను తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

ఈ చిత్రంలో ప్రతిభావంతులైన నటీనటులున్నారు. అనసూయ, సాయికుమార్, వైవా హర్ష, శుభలేఖ సుధాకర్ పాత్రలు బాగున్నాయి. గతంలో పేపర్ బాయ్ లాంటి సినిమా తీసిన జయశంకర్, ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

ఆర్వీ సినిమాస్ బ్యానర్‌పై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు.



First Published:  12 March 2023 3:01 PM GMT
Next Story