Telugu Global
Cinema & Entertainment

Gam Gam Ganesha - గం..గం..గణేశా మూవీ టీజర్ ఎలా ఉందంటే?

Gam Gam Ganesha - ఆనంద్ దేవరకొండ తాజా చిత్రం గం..గం..గణేశా. ఈ సినిమా టీజర్ రిలీజైంది.

Gam Gam Ganesha - గం..గం..గణేశా మూవీ టీజర్ ఎలా ఉందంటే?
X

"బేబీ" సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా "గం..గం..గణేశా". ఇప్పటిదాకా తను చేయని యాక్షన్ జానర్ లో ఆనంద్ ఈ సినిమా చేస్తున్నాడు. "గం..గం..గణేశా" సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు.

ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న"గం..గం..గణేశా" సినిమా టీజర్ ను ఇవాళ హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు శివ నిర్వాణ, అనుదీప్ కేవీ, విరూపాక్ష కార్తీక్ దండు, మిడిల్ క్లాస్ మెలొడీస్ డైరెక్టర్ వినోద్ అతిథులుగా పాల్గొన్నారు.

టీజర్ విషయానికొస్తే.. మన లైఫ్ లో ఏదో ఒక సందర్భంలో క్రేజీ క్యారెక్టర్స్ చూస్తుంటాం. అలాంటి క్రేజీ క్యారెక్టర్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయనే విషయం టీజర్ చూస్తే అర్థమౌతుంది. టీజర్ లో యాక్షన్ తో పాటు మంచి ఫన్ ఉంది.

ఫన్, క్రైమ్, యాక్షన్ వంటి అంశాలన్నీ టీజర్ లో కనిపించాయి. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ క మంచి ఫీల్ తీసుకొచ్చింది. భయం, అత్యాశ, కుట్ర చుట్టూ ఈ సినిమా తిరుగుతుందనే విషయం టీజర్ చూస్తే తెలుస్తోంది.. సినిమాలో అన్నీ గ్రే క్యారెక్టర్స్ ఉంటాయి. ఎవరి ప్లాన్స్ తో వారు ఉంటారు. రేసీ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

రీసెంట్ గా బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆనంద్ దేవరకొండ, ఇప్పుడు గం..గం..గణేశతో మరో డిఫరెంట్ జానర్ ట్రై చేశాడు. ఇది కూడా కచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నాడు ఈ హీరో.

First Published:  15 Sept 2023 6:04 PM GMT
Next Story