Telugu Global
Cinema & Entertainment

Baby Teaser: మరో స్వచ్ఛమైన ప్రేమకథ

Baby Movie Teaser: ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం బేబి. సాయి రాజేష్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ ను లాంఛ్ చేశారు.

Baby Teaser: మరో స్వచ్ఛమైన ప్రేమకథ
X

సాయిరాజేష్ తీసే సినిమాలన్నీ సెన్సిబుల్ గా ఉంటాయి. కలర్ ఫొటోతో జాతీయ అవార్డ్ అందుకున్న ఈ దర్శకుడు, తాజాగా బేబి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి కూడా తన స్టయిల్ మిస్సవ్వలేదు. స్వచ్ఛమైన ప్రేమకథను తెరపై చూపించే ప్రయత్నం చేశాడు.

తాజాగా బేబీ టీజర్ రిలీజైంది. టీజర్ చూస్తే, ఓ అందమైన ప్రేమకథను దర్శకుడు ప్రజెంట్ చేసినట్టు కనిపిస్తోంది. టీనేజ్ అబ్బాయిగా ఆనంద్ దేవరకొండను, టీనేజ్ అమ్మాయిగా వైష్ణవి చైతన్యను పరిచయం చేసిన దర్శకుడు.. వాళ్ల మధ్య చిగురించే స్వచ్ఛమైన ప్రేమను అత్యంత సహజంగా చూపించాడు.

Advertisement

అయితే టీజర్ లో అంతకుమించి ఎలాంటి క్లూస్ వదల్లేదు. చివర్లో ఖరీదైన కారులో ఓ వ్యక్తి దిగడం, హీరోయిన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో ఆసక్తికరంగా టీజర్ ను ముగించాడు. అంతకుమించి కథకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు మేకర్స్.

టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఎస్కేఎన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు. ఈ మూవీపై ఆనంద్ దేవరకొండ చాలా ఆశలు పెట్టుకున్నాడు.

Advertisement



Next Story