Telugu Global
Cinema & Entertainment

Anand Devarakonda | గం..గం.. గణేషా అంటే అర్థం ఇదా..!

Anand Devarakonda - ఆనంద్ దేవరకొండ తాజా చిత్రం గం..గం..గణేశా. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది.

Anand Devarakonda | గం..గం.. గణేషా అంటే అర్థం ఇదా..!
X

"బేబీ" సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఆయన ప్రస్తుతం "గం..గం..గణేశా" అనే కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటిదాకా తను చేయని యాక్షన్ జానర్ లో ఆనంద్ ఈ సినిమా చేస్తున్నాడు. "గం..గం..గణేశా" సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న"గం..గం..గణేశా" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆనంద్ దేవరకొండ తన సోషల్ మీడియా అక్కౌంట్స్ ద్వారా రిలీజ్ చేశాడు. పోస్టర్ లో రెండు రైఫిల్స్ పట్టుకొని కనిపిస్తున్నాడు ఆనంద్ దేవరకొండ. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో గన్స్ పట్టుకున్న గ్యాంగ్స్, బాంబ్ బ్లాస్టింగ్ సీన్స్ కనిపిస్తున్నాయి.

రాజావారి పల్లి అనే బోర్డు మీద రన్ - ఫన్ - గన్ అనే క్యాప్షన్ రాసి ఉంది. మొత్తంగా ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. "గం..గం..గణేశా" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేస్తూ ఇది యాక్షన్ మూవీనా?, కామెడీ మూవీనా ? ..త్వరలో మనం తెలుసుకుందాం. మరిన్ని డీటెయిల్స్, అప్ డేట్స్ రాబోతున్నాయంటూ రాసుకొచ్చాడు.

ప్రస్తుతం "గం..గం..గణేశా" సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు చైతన్ భరధ్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  9 Sep 2023 5:04 PM GMT
Next Story