Telugu Global
Cinema & Entertainment

Baby Movie | 12 రోజుల్లో బేబి సాధించిన వసూళ్లు ఇవి

Baby Movie - ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబి సినిమా రెండో వారంలో కూడా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. మంచి వసూళ్లు సాధిస్తోంది.

Baby movie review: బేబీ- మూవీ రివ్యూ! {2.25/5}
X

Baby movie review: బేబీ- మూవీ రివ్యూ! {2.25/5}

చిన్న సినిమాగా వచ్చిన బేబి, బాక్సాఫీస్ బరిలో దుమ్ముదులుపుతోంది. విడుదలైన ప్రారంభంలో ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ, యూత్ మద్దతుతో ఈ సినిమా దూసుకుపోతోంది. ఓ వైపు వర్షాలు దంచికొడుతున్నప్పటికీ, బేబి సినిమాకు ఆక్యుపెన్సీ నిలకడగా ఉండడం విశేషం.

రెండో వారంలో కూడా ఈ సినిమా కళ్లు చెదిరే కలెక్షన్లు సాధిస్తోంది. అంతేకాదు, ఈ వీకెండ్ కూడా ఇతర సినిమాలకు గట్టిపోటీ నిచ్చే స్థాయిలో నిలబడింది ఈ సినిమా. నిన్నటితో బేబి మూవీ 12 రోజుల రన్ పూర్తి చేసుకుంది.

ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన ఈ మూవీ, విడుదలైన ఈ 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 71 కోట్ల 60 లక్షల రూపాయల గ్రాస్ సాధించింది. త్వరలోనే ఈ మూవీ 75 కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్ లో చేరబోతోంది. ఓ చిన్న సినిమా, ఈ రేంజ్ లో వసూళ్లు సాధించడం చాలా పెద్ద విషయం.

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. సాయిరాజేష్ డైరక్ట్ చేసిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ను ఎస్కేఎన్ నిర్మించాడు. మొదటి వారం పూర్తయిన తర్వాత తెలివిగా, అల్లు అర్జున్ తో ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు మేకర్స్. రెండో వారానికి అది బాగా పనికొచ్చింది. ఇదే కోవలో మూడో వారానికి కూడా మరో ఈవెంట్ ప్లాన్ చేస్తారేమో చూడాలి.

First Published:  26 July 2023 1:45 PM GMT
Next Story