Telugu Global
Cinema & Entertainment

Amitabh Bachchan | స్విగ్గీలో బిగ్ బి

Amitabh Bachchan | బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరో కొత్త వ్యాపారంలో భాగస్వామి అయ్యారు. స్విగ్గీలో ఆయన పెట్టుబడులు పెట్టారు.

Amitabh Bachchan | స్విగ్గీలో బిగ్ బి
X

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ యాక్టర్. అతనిప్పుడు చాలా సినిమాలు చేస్తున్నాడు. అన్నీ క్రేజీ ప్రాజెక్టులే. ఇటీవల కల్కి సినిమాలో బిగ్ బి పోషించిన అశ్వద్ధామ పాత్రకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి.

ఓవైపు సినిమాలు చేస్తూనే, అలా సంపాదించిన డబ్బును పెట్టుబడుల్లో పెడుతున్నారు బిగ్ బి. తాజాగా అమితాబ్ బచ్చన్, అతని కుటుంబం ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లలో ఒకటైన స్విగ్గీలో పెట్టుబడి పెట్టారు. అమితాబ్ బచ్చన్ కుటుంబం స్విగ్గీలో చిన్న షేర్ తీసుకుంది. 15 బిలియన్ డాలర్ల లక్ష్యంగా పెట్టుకున్న స్విగ్గీలోకి బిగ్ బి అడుగుపెట్టారు.

పెట్టుబడులు పెట్టిన అమితాబ్.. ఈ యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఈయన చేతిలో 11 కార్పొరేట్ బ్రాండ్స్ ఉన్నాయి. స్విగ్గీ కూడా చేరితో బిగ్ బి ప్రచారం చేసే కంపెనీల సంఖ్య 12కు చేరుతుంది.

ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ రజనీకాంత్‌తో కలిసి వేట్టైయాన్ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇది అతని మొదటి తమిళ అరంగేట్రం. హమ్ అనే సినిమా తర్వాత చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ఇద్దరూ ఈ చిత్రంలో స్క్రీన్ పంచుకోనున్నారు. వెట్టయన్‌ను అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

First Published:  30 Aug 2024 4:52 PM GMT
Next Story