Telugu Global
Cinema & Entertainment

Mahesh Babu: మహేష్ తండ్రిగా అమితాబ్ బచ్చన్?

Mahesh babu: మహేష్ బాబు కొత్త సినిమాలో అమితాబ్ బచ్చన్ నటించబోతున్నారా? మహేష్ కు తండ్రిగా ఆయన కనిపించబోతున్నారా?

Mahesh Babu
X

Mahesh Babu

మహేష్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి రోజుకో పుకారు పుట్టుకొస్తోంది. మొన్నటివరకు హీరోయిన్ల విషయంలో పుకార్లు వచ్చాయి. ఎప్పుడైతే ఫస్ట్ హీరోయిన్ గా పూజాహెగ్డే, సెకెండ్ హీరోయిన్ గా శ్రీలీల ఫిక్స్ అయ్యారో ఆ పుకార్లు ఆగిపోయాయి. ఆ తర్వాత విలన్ విషయంలో పుకార్లు వచ్చాయి. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను ఇందులో విలన్ గా తీసుకుంటున్నారంటూ ప్రచారం జరిగింది.

ఇప్పుడు మరో కొత్త పుకారు ఈ సినిమాపై వినిపిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో మహేష్ తండ్రి పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ను తీసుకున్నారట. పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమాలో బిగ్ బిని తీసుకుంటే బాగుంటుందనేది అందరి అభిప్రాయం.

Advertisement

మరోవైపు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జవవరి నుంచి మహేష్-త్రివిక్రమ్ కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నారు. దీనికి సంబంధించి 3 భారీ సెట్స్ నిర్మిస్తున్నారు.

ఈ గ్యాప్ లో మరోసారి విదేశాలకు వెళ్లబోతున్నాడు మహేష్. పిల్లలకు క్రిస్మస్ శెలవులు వస్తుండడంతో, కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. డిసెంబర్ 31 రాత్రి కూడా విదేశాల్లోనే గడిపి, జనవరి మొదటి వారంలో తిరిగి హైదరాబాద్ రావాలనేది మహేష్ బాబు ప్లాన్.

Next Story