Telugu Global
Cinema & Entertainment

Ambajipeta Marriage Band - సుహాస్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల

Ambajipeta Marriage Band - సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Ambajipeta Marriage Band - సుహాస్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల
X

గీతా ఆర్ట్స్ -2 బ్యానర్ పై తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’. బ‌న్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తుండగా, దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నాడు. 18-పేజెస్ తర్వాత ఈ బ్యానర్ పై నుంచి వస్తున్న సినిమా ఇదే.

సుహాస్ హీరోగా చేస్తున్న ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. దుశ్యంత్ కటికనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేసే మల్లి అనే కుర్రాడిగా సుహాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. రిలీజ్ చేసిన పోస్టర్ లో మల్లికార్జున సెలూన్ షాప్ ను చూపిస్తూ, సెలూన్ షాప్ ముందు ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ మెంబర్స్ ను రివీల్ చేశారు. సుహాస్ తో పాటు గోపరాజు రమణ, పుష్ప ఫేమ్ జగదీశ్ డప్పులు, సన్నాయి తో పాటు వివిధ రకాల వాయిద్యాలతో ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు.

శేఖర్ చంద్ర ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే పాటల విడుదల కార్యక్రమం మొదలుపెట్టబోతున్నారు. ఈ వేసవిలోనే ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

First Published:  11 April 2023 3:24 PM GMT
Next Story