Telugu Global
Cinema & Entertainment

Kantara Movie: ఈ నెల్లోనే కాంతార.. అమెజాన్ దెబ్బ

Kantara Movie OTT release date: కాంతార సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇంకా ఈ సినిమాకు ఆక్యుపెన్సీ ఉంది. అంతలోనే అమెజాన్ లోకి రాబోతోంది ఈ సినిమా.

Kantara OTT Release Date
X

Speculations on Kantara OTT release

బడా సినిమాలు లేకపోవడం, ఉన్న సినిమాలు ఆడకపోవడంతో కాంతార సినిమాకు బాగా కలిసొచ్చింది. దాదాపు 10 రోజులుగా టాలీవుడ్ మార్కెట్ ను ఏలుతోంది ఈ సినిమా. మరో వారం రోజుల పాటు ఈ సినిమాకు తెలుగులో పోటీ లేదు. ఎందుకంటే, సమంత నటించిన యశోద సినిమా తప్ప మరో క్రేజీ ప్రాజెక్టు థియేటర్లలోకి రావడం లేదు.

మరోవైపు కాంతార సినిమాపై మంచి అంచనాలున్నాయి. రోజురోజుకు ఈ సినిమాకు మౌత్ టాక్ పెరుగుతోంది. ఈ సినిమాను చూస్తే థియేటర్లలోనే చూడాలంటున్నారు చాలామంది ప్రేక్షకులు. దీంతో సాధారణ రోజుల్లో కూడా కాంతారకు ఆక్యుపెన్సీ ఉంటోంది. మినిమం వసూళ్లు వస్తున్నాయి.

ఇలాంటి టైమ్ లో కాంతారపై ఊహించని దెబ్బ పడింది. అది అమెజాన్ రూపంలో ఎదురైంది. అవును.. ఈ నెల్లోనే కాంతార సినిమాను అమెజాన్ లో స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నారు. రేపోమాపో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వస్తుంది.

ఈ సినిమా అమెజాన్ లోకి వచ్చిందంటే, థియేట్రికల్ రన్ దాదాపు ముగిసినట్టే. అదే ఇప్పుడు కాంతార బయ్యర్లను ఇబ్బంది పెడుతోంది. అమెజాన్ స్ట్రీమింగ్ ను వాయిదా వేయాలని వీళ్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ అది జరిగే పని కాదు.

First Published:  10 Nov 2022 4:02 AM GMT
Next Story