Telugu Global
Cinema & Entertainment

ఎల్లుండి నుంచి అల్లూరి యాత్ర

శ్రీవిష్ణు హీరోగా నటించిన సినిమా అల్లూరి. ఇందులో నిజాయితీ గల పోలీసాఫీసర్ గా నటించాడు శ్రీవిష్ణు. అందుకే ప్రమోషనల్ టూర్ పెట్టి, తెలుగు రాష్ట్రాల్లో నిజాయితీగా పనిచేస్తున్న పోలీసుల్ని సత్కరించాలని నిర్ణయించుకున్నారు.

ఎల్లుండి నుంచి అల్లూరి యాత్ర
X

హీరో శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అల్లూరి'. పోలీస్ ఆఫీసర్ ఫిక్షనల్ బయోపిక్‌ ఇది. నిజాయితీకి మారు పేరు అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీవిష్ణు నిజాయితీ గల పోలీసు ఆఫీసర్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు.

సెప్టెంబర్ 23న అల్లూరి సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఇందులో భాగంగా ఎల్లుండి (సెప్టెంబర్ 3) నుంచి అల్లూరి టీం యాత్రని ప్రారంభించబోతోంది.

సెప్టెంబర్ 3 నుంచి వైజాగ్ లో అల్లూరి సీతారామారాజు గారి సమాధి దగ్గర నుండి హీరోతో పాటు సినిమా యూనిట్ అంతా కలసి యాత్రని ప్రారంభిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పర్యటించి, పోలీసులు అధికారులకు సన్మానం చేస్తూ పబ్లిక్ ను కలుస్తూ 12 రోజుల పాటు టూర్ ప్లాన్ చేశారు. వైజాగ్ లో మొదలైన ఈ టూర్ నిజామాబాద్ వరకు కొనసాగుతుంది.

టూర్ ముగిసిన తర్వాత ప్రీరిలీజ్ ఈవెంట్ చేసి సినిమాని గ్రాండ్ విడుదల చేస్తారు. 'అల్లూరి' షూటింగ్ నిన్నటితో పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. రేపటి నుండి సినిమాకి సంబంధించిన పాటలు వరుసగా విడుదల చేసి 10 రోజుల తర్వాత ట్రైలర్ విడుదల చేస్తారు. హర్షవర్షన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

First Published:  1 Sep 2022 12:45 PM GMT
Next Story