Telugu Global
Cinema & Entertainment

అల్లూరి.. శ్రీవిష్ణు సినిమా ట్రయిలర్ ఎలా ఉందంటే?

శ్రీవిష్ణు మరోసారి రెడీ చేశాడు. ఈసారి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఆ సినిమా పేరు అల్లూరి. తాజాగా ట్రయిలర్ రిలీజైంది.

అల్లూరి.. శ్రీవిష్ణు సినిమా ట్రయిలర్ ఎలా ఉందంటే?
X

శ్రీవిష్ణు నటించిన సినిమా 'అల్లూరి'. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. ఈ చిత్రం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో నాని లాంచ్ చేశాడు.

తనికెళ్ల భరణి ఒక యువకుడికి చెప్పే స్ఫూర్తిదాయకమైన మాటలతో ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత శ్రీవిష్ణు నేరస్తులను అదుపు చేయడంలో తనకంటూ ఓ స్పెషల్ స్టయిల్ ఉన్న పోలీస్ ఆఫీసర్ అల్లూరిగా పరిచయమయ్యాడు. కేసులను డీల్ చేయడానికి వేరే మార్గం లేనప్పుడు అతను క్రూరంగా మారుతుంటాడు. నక్సలైట్లు, నేరస్తుల్లో మార్పు తీసుకువస్తాడు. కానీ అతను అధిగమించడానికి ఇంకా పెద్ద అడ్డంకులు ఉంటాయి. పోలీస్ ఉద్యోగం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేస్తాడు.

అల్లూరి స్పూర్తిదాయకమైన ప్రయాణాన్ని ట్రైలర్ లో వివరంగా చూపించారు. శ్రీవిష్ణు మేకోవర్, అతడి నటన బాగుంది. శ్రీవిష్ణు భార్యగా కైదు లోహర్ తన పాత్రను చక్కగా పోషించింది.

ప్రదీప్ వర్మ తన రైటింగ్, టేకింగ్‌తో మంచి ఇంప్రెషన్‌ కలిగించాడు. రాజ్ తోట కెమెరా పనితనం, హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం బాగున్నాయి.

సెప్టెంబర్ 18న హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది అల్లూరి.Next Story