Telugu Global
Cinema & Entertainment

హైదరాబాద్ లో మరో ఫిలిం స్టుడియో

టాలీవుడ్ మేకర్స్ కు మరో ఫిలిం స్టుడియో అందుబాటులోకి వచ్చింది. ఈరోజు చిరంజీవి చేతులు మీదుగా అల్లు స్టుడియోస్ ప్రారంభమైంది.

హైదరాబాద్ లో మరో ఫిలిం స్టుడియో
X

హైదరాబాద్ లో టాలీవుడ్ కు అందుబాటులో చాలా స్టుడియోస్ ఉన్నాయి. రామోజీ ఫిలింసిటీ, అన్నపూర్ణ స్టుడియోస్, రామానాయుడు స్టుడియోస్, రామకృష్ణ స్టుడియోస్.. ఇలా చాలా అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు ఎన్నో ప్రైవేట్ ఫ్లోర్స్, బిల్డింగులు కూడా షూటింగ్స్ కు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా ఇప్పుడు మరో స్టుడియో వెలిసింది.

ఫస్ట్ టైమ్ మెగా కాంపౌండ్ నుంచి ఓ స్టుడియో లాంఛ్ అయింది. అలా అని చిరంజీవి లేదా రామ్ చరణ్ కు చెందిన స్టుడియో కాదు. దాని పేరు అల్లు స్టుడియోస్. అల్లు అరవింద్, అల్లు అర్జున్ కలిసి నిర్మించుకున్న స్టుడియో ఇది. ఈరోజు ఈ స్టుడియోను చిరంజీవి లాంచ్ చేశారు.

ప్రస్తుతం ఇందులో ఫ్లోర్స్ నిర్మాణం జరుగుతోంది. అందుబాటులోకి రావడానికి మరికొన్నాళ్లు పడుతుంది. అయితే అల్లు రామలింగయ్య శత జయంతిని పురస్కరించుకొని ఈ స్టుడియోను ఈరోజు ప్రారంభించారు. చిరంజీవి, సురేఖ కలిసి రిబ్బన్ కట్ చేసి ఈ స్టుడియోను లాంచ్ చేశారు.

ప్రారంభోత్సవానికి అల్లు కుటుంబ పరివారం అంతా హాజరైంది. బన్నీ, శిరీష్, బాబి, అరవింద్ తో పాటు వాళ్ల కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. చరణ్ ఫ్యామిలీ మాత్రం ఎటెంట్ కాలేకపోయింది. ఇది లాభాపేక్ష కోసం కట్టిన స్టుడియో కాదంటున్నారు అల్లు అరవింద్. తన తండ్రి అల్లు రామలింగయ్యకు ఘనమైన గుర్తింపునివ్వడం కోసం, మెగా ఫ్యామిలీకి ఓ స్టేటస్ సింబల్ గా ఉండడం కోసం ఈ స్టుడియో కట్టామని తెలిపారు.






First Published:  1 Oct 2022 1:21 PM GMT
Next Story