Telugu Global
Cinema & Entertainment

ఊర్వశివో.. రాక్షసివో టీజర్.. ముద్దులే ముద్దులు

అల్లు శిరీష్ నుంచి కొత్త సినిమా రెడీ అయింది. దీనికి పాత పేరు తొలిగించి, ఊర్వశివో రాక్షసివో అనే కొత్త టైటిల్ పెట్టారు. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.

ఊర్వశివో.. రాక్షసివో టీజర్.. ముద్దులే ముద్దులు
X

అల్లు శిరీష్ కొత్త సినిమా ఊర్వశివో..రాక్షసివో. చాన్నాళ్ల పాటు ల్యాబ్ లోనే ఉండిపోయిన ఈ మూవీ, ఎట్టకేలకు టైటిల్ మార్పుతో థియేటర్లలోకి రాబోతోంది. గీతాఆర్ట్స్-2 బ్యానర్ నుంచి వస్తున్న తాజా చిత్రం ఇదే.

ఈ చిత్రానికి "విజేత" సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహించాడు. శిరీష్ సరసన అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. తాజాగా "ఉర్వశివో రాక్షసివో" టీజర్ ను రిలీజ్ చేశారు.

టీజర్ చూస్తుంటే పూర్తిగా యూత్ ను టార్గెట్ చేస్తూ, ఈ సినిమా తీశారనే విషయం అర్థమౌతోంది. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ బాగా సెట్ అయింది. యూత్‌పుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెరకెక్కిన ఈ టీజర్ ఆకట్టుకునేలా ఉంది.

టీజర్ లోని కొన్ని డైలాగ్స్, అలానే కొన్ని సీన్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. అంతర్లీనంగా ప్రేమకి, స్నేహానికి ఉన్న తేడాను దర్శకుడు ఆవిష్కరించినట్లు అర్ధమవుతుంది.

స్మాల్ గ్యాప్ తర్వాత శిరీష్ నుంచి ఈ చిత్రం వస్తోంది. అందుకే గీతాఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమా కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. పద్ధతిగా ప్రచారం చేస్తోంది. ఈ సినిమాకి అచ్చు రాజమణి సంగీతం సమకూర్చారు. నవంబర్ 4న మూవీ రిలీజ్ అవుతుంది.



First Published:  30 Sep 2022 4:30 AM GMT
Next Story