Telugu Global
Cinema & Entertainment

Allu Sirish | మళ్లీ తెరపైకి అల్లు శిరీష్

Allu Sirish - బడ్డీ అనే సినిమాలో నటిస్తున్నాడు అల్లు శిరీశ్. ఈ సినిమా ప్రచారం మొదలుకాబోతోంది.

Allu Sirish | మళ్లీ తెరపైకి అల్లు శిరీష్
X

అల్లు శిరీష్ మళ్లీ గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో వచ్చిన ఊర్వశివో రాక్షసివో సినిమా తర్వాత ఇంకో సినిమా చేయడానికి అతడికి చాన్నాళ్లు పట్టింది. ఎట్టకేలకు బడ్డీ అనే సినిమాను రెడీ చేశాడు ఈ అల్లు హీరో.

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "బడ్డీ". గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న బడ్డీ సినిమా నుంచి ఈ రోజు ఫస్ట్ సింగిల్ రిలీజ్ అనౌన్స్ మెంట్ వచ్చింది.

రేపు ఉదయం 10 గంటలకు ఈ మూవీ ఫస్ట్ సింగిల్ 'ఆ పిల్ల కనులే..'ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. హిప్ హాప్ తమీజా ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న బడ్డీ సినిమాను త్వరలోనే థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

First Published:  14 May 2024 6:15 PM GMT
Next Story