Telugu Global
Cinema & Entertainment

ఆ లిఫ్ట్ సీన్ అందుకే పెట్టాం

ఆర్య సినిమా టైపులో ఊర్వశివో రాక్షసివో సినిమాలో కూడా ఓ లిఫ్ట్ సీన్ ఉంది. మరి దీనిపై హీరో అల్లు శిరీష్ ఏమంటున్నాడు?

ఆ లిఫ్ట్ సీన్ అందుకే పెట్టాం
X

లిఫ్ట్ సీన్ లో రొమాన్స్ అనగానే ఎవరికైనా ఆర్య సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాలో కాజల్ ను ఆర్య లిఫ్ట్ లో ముద్దు పెట్టుకుంటాడు. ఆ సీన్ తర్వాత లిఫ్ట్ లో ఏ సీన్ తీసినా ఆర్య సినిమానే గుర్తొస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ సేమ్ టు సేమ్ అలాంటి సన్నివేశాన్నే రిపీట్ చేశాడు.

అల్లు శిరీష్ తాజా చిత్రం ఊర్వసివో రాక్షసివో. అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్. రాకేష్ శశి దర్శకుడు. ఈ సినిమాలో కూడా ఓ లిఫ్ట్ సీన్ ఉంది. పైగా ఆ సన్నివేశాన్ని టీజర్ లో కూడా చూపించారు. దీంతో చాలామంది బన్నీ సినిమాతో శిరీష్ సినిమాకు పోలిక పెట్టడం మొదలుపెట్టారు.

దీనిపై హీరో శిరీశ్ స్పందించాడు. సినిమాలో లిఫ్ట్ సీన్ ను ఏదో కావాలని పెట్టలేదంటున్నాడు శిరీష్. ఆ సన్నివేశం చాలా కీలకమైనదని, సినిమాను మలుపు తిప్పుతుందని చెబుతున్నాడు. అది అంత ఇంపార్టెంట్ సీన్ కాబట్టే టీజర్ లో కూడా పెట్టామంటున్నాడు.

సినిమా చూసిన తర్వాత లిఫ్ట్ సీన్ పై అభిప్రాయం మారిపోతుందని అంటున్నాడు శిరీష్. నవంబర్ 4న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ విషయాన్ని చెప్పేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు.

First Published:  21 Oct 2022 3:19 AM GMT
Next Story