Telugu Global
Cinema & Entertainment

ఈ సినిమాకు టైటిల్ మార్చేశారు

చాన్నాళ్లుగా ఒకే సినిమా చేస్తున్నాడు అల్లు శిరీష్. ఆమధ్య ప్రచారం స్టార్ట్ చేసి ఆపేశారు. ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టారు. కట్ చేస్తే, సినిమా టైటిల్ మార్చేశారు.

ఈ సినిమాకు టైటిల్ మార్చేశారు
X

అల్లు శిరీష్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గీతాఆర్ట్స్2 బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహించాడు. ఇంతకుముందు కల్యాణ్ దేవ్ తో విజేత అనే సినిమా తీసింది ఇతడే. తాజా చిత్రంలో అల్లు శిరీశ్ సరసన అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది.

ఇప్పుడీ ప్రాజెక్టుకు పేరు మార్చారు. "ప్రేమకాదంట" అని మొదటి అనౌన్స్ చేసిన ఈ చిత్ర టైటిల్ ను ప్రస్తుతం "ఉర్వశివో రాక్షసివో" అని మార్చి అధికారికంగా టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ యూత్ ను ఆకర్షించేలా ఉంది. శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ కెమిస్ట్రీ బాగుంది.

ఈ సినిమా టీజర్ ను సెప్టెంబర్ 29న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. అచ్చు రాజమణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

GA2 పిక్చర్స్ బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సినిమాను నవంబర్ 4న విడుదల చేయబోతున్నారు.




First Published:  27 Sep 2022 4:26 AM GMT
Next Story