Telugu Global
Cinema & Entertainment

Allu Arjun | టుస్సాడ్స్ లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం

Allu Arjun's Wax Statue - అల్లు అర్జున్ మైనపు ప్రతిమ సిద్ధమైంది. త్వరలోనే దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాడు బన్నీ.

Allu Arjun | టుస్సాడ్స్ లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం
X

పుష్ప చిత్రంలోని నటనకు గానూ ఇటీవలే నేషనల్ అవార్డును పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మరో అరుదైన ఘనతను సాధించారు. ‘మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్‌’లో మైనపు విగ్రహం ఉన్న మొదటి తెలుగు నటుడిగా ఐకాన్ స్టార్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు. తాజాగా ‘మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్‌’ వారు అల్లు అర్జున్ కొలతలు తీసుకుంటున్న వీడియో ఒకటి వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ వీడియోలో అల్లు అర్జున్ నల్లటి సూట్ ధరించి కనిపిస్తున్నాడు.

ఈ సంవత్సర ప్రారంభంలో దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో కొంతమంది ప్రముఖులు, కళాకారుల మధ్య ఒక సిట్టింగ్ జరిగింది. ఇందులో ఒక్కొక్కరి నుంచి 200కి పైగా కొలతలను వారు సేకరించారు. అద్భుతమైన మైనపు విగ్రహాలను రూపొందించడానికి ఇలా డీటెయిల్డ్ గా కొలతలు తీసుకునే ప్రక్రియ ఎప్పటి నుంచో ఉంది. ఈ కొలతలతో వారు రూపొందించే విగ్రహాల పక్కన ఒరిజనల్ వ్యక్తులు నిలబడితే.. ఎవరు ఒరిజినల్, ఎవరు విగ్రహం అని కనిబెట్టడం కూడా చాలా కష్టం. అంత అద్భుతంగా టుస్సాడ్స్ లో విగ్రహాలుంటాయి.

అల్లు అర్జున్ నేడు ప్రపంచానికి తెలిసిన నటుడు. తన విలక్షణమైన నటనతో గ్లోబల్ రేంజ్ గుర్తింపును సొంతం చేసుకున్నాడు. నేషనల్ అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించడమే కాకుండా.. ప్రాంతీయ సరిహద్దులను చెరిపేశాడు.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారినే కాకుండా.. ఇతర భాషల వారిని సైతం తన అసాధారణమైన నటనా పటిమతో ఫ్యాన్స్ అయ్యేలా చేసుకున్నారు. ముందు ముందు ఐకానిక్ పెర్ఫార్మెన్స్‌లతో భారతీయ సినిమాని శాసించడానికి సిద్ధంగా ఉన్నాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ పార్ట్ 2 అయిన ‘పుష్ప ది రూల్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. సుకుమార్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్.

First Published:  6 Oct 2023 1:33 AM GMT
Next Story