Telugu Global
Cinema & Entertainment

Pushpa 2 | పుష్ప-2 టీజర్ వచ్చేస్తోంది..!

Pushpa 2 - పుష్ప2 టీజర్ రెడీ అవుతోంది. బన్నీ బర్త్ డే కానుకగా 8వ తేదీన రాబోతోంది.

Pushpa 2 | పుష్ప-2 టీజర్ వచ్చేస్తోంది..!
X

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో దేశవ్యాప్తంగా సంచలనంగా మారాడు బన్నీ. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా పుష్ప 2 వస్తోంది.

తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 8న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతో పాటు.. అతడికి జాతీయస్థాయి అవార్డు కూడా తెచ్చిపెట్టింది.

దీంతో సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప-2 పై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా గతంలో గ్లింప్స్ రిలీజైంది. ఇప్పుడు టీజర్ రాబోతోంది.

2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.



First Published:  2 April 2024 4:49 PM GMT
Next Story