Telugu Global
Cinema & Entertainment

Pushpa 2 | పుష్ప-2 టీజర్ రెడీ

Pushpa 2 - పుష్ప-2 టీజర్ రెడీ అయింది. బన్నీ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ను, అతడి పుట్టినరోజున విడుదల చేయబోతున్నారు.

Pushpa 2 | పుష్ప-2 టీజర్ రెడీ
X

అల్లు అర్జున్ పుట్టినరోజుకు భారీ గిఫ్ట్ రెడీ అవుతోంది. పుష్ప-2 టీజర్ రెడీ అవుతోంది. దర్శకుడు సుకుమార్ ఇప్పుడు ఇదే పని మీద ఉన్నాడు. ఈ టీజర్ కోసం కూడా సుకుమార్ తనదైన శైలిలో డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. తన టీమ్ ను 3 భాగాలుగా చేశాడు.

ముగ్గురికీ వేర్వేరు యూనిట్స్ కేటాయించాడు. 3 టీమ్స్ తో 3 టీజర్స్ కట్ చేయించాడు. అలా వచ్చిన 3 టీజర్స్ నుంచి ది బెస్ట్ కట్ ను ఫైనల్ టీజర్ గా తను కంపోజ్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి 3 టీజర్స్ ఉన్నాయి. వాటిని ఒక టీజర్ గా మలిచే ప్రక్రియలో సుకుమార్ బిజీగా ఉన్నాడు.

సోమవారం నుంచే ఈ ప్రక్రియ మొదలైంది. రేపటికి పూర్తిస్థాయి టీజర్ రెడీ అవుతుంది. బన్నీని ఎలివేట్ చేస్తూనే, సినిమా కథను బయటపెట్టేలా టీజర్ కట్ చేయాలనేది సుక్కూ ఆలోచన. ఆ ప్లాన్ లో భాగంగానే టీజర్ నిడివి కాస్త పెరిగినట్టు తెలుస్తోంది. ఇంకాస్త ట్రిమ్ చేసి లాక్ చేస్తారు.

కేవలం అల్లు అర్జున్ కాకుండా, పుష్ప-2లో కీలక పాత్రధారులంతా టీజర్ లో కనిపిస్తారట. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్లో ఉందని తెలుస్తోంది. ఈ టీజర్ యూనిట్ కు చాలా కీలకం. ఇప్పటికే సినిమాపై భారీగా అంచనాలున్నాయి.

ఆ అంచనాల్ని అందుకోవాలన్నా, సినిమాపై మరింత హైప్ పెంచాలన్నా, అది ఈ టీజర్ తోనే సాధ్యం. అందుకే సుకుమార్ మరింత శ్రద్ధ పెట్టాడు. టీజర్ కట్స్ లో సుకుమార్ స్టయిల్ అందరికీ తెలిసిందే.




First Published:  6 April 2024 2:15 AM GMT
Next Story