Telugu Global
Cinema & Entertainment

Pushpa 2 | పుష్ప-2 షూటింగ్ అప్ డేట్స్

Pushpa 2 - పుష్ప-2 సినిమా హైదరాబాద్ నుంచి వైజాగ్ కు షిఫ్ట్ అయింది. ఈరోజు నుంచి కొత్త షెడ్యూల్ షురూ అయింది.

Pushpa 2 | పుష్ప-2 షూటింగ్ అప్ డేట్స్
X

హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు మారింది పుష్ప-2 లొకేషన్. ఈరోజు నుంచి ఈ సినిమాకు సంబంధించి విశాఖలో కొత్త షెడ్యూల్ మొదలైంది. స్వయంగా అల్లు అర్జున్ ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. దీని కోసం నిన్ననే అతడు విశాఖలో ల్యాండ్ అవ్వగా, అల్లు అర్జున్ ఆర్మీ అతడికి ఘనంగా స్వాగతం పలికింది.

ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా హోటల్ కు చేరుకున్న బన్నీ, నిన్నంతా రెస్ట్ తీసుకొని, ఇవాళ్టి నుంచి షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం బన్నీ, ఫైటర్స్ మధ్య కొన్ని యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నారు. ఈ షెడ్యూల్ ఈ వారమంతా కొనసాగుతుంది. నటుడు ఫహాద్ ఫాజిల్ కూడా ఈ షెడ్యూల్ లో జాయిన్ అవుతాడు.

అంతకంటే ముందు రామోజీ ఫిలింసిటీలో పుష్ప-2 కోసం వేసిన భారీ సెట్ లో సాంగ్ షూట్ చేశారు. అల్లు అర్జున్, రష్మిక కాంబినేషన్ లో ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేశారు. సాంగ్ షూట్ పూర్తయిన వెంటనే, రష్మిక అటు ముంబయికి, బన్నీ ఇటు విశాఖకు చేరుకున్నారు.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప-2కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్ట్ 15న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

First Published:  11 March 2024 5:15 PM GMT
Next Story