Telugu Global
Cinema & Entertainment

బన్నీ రిలీజ్ చేసిన బ్రేక్ అవుట్

బ్రహ్మానందం కొడుకు గౌతమ్ హీరోగా నటించిన సినిమా బ్రేక్ అవుట్. కాన్సెప్ట్ మూవీగా వస్తున్న ఈ సినిమా ట్రయిలర్ ను అల్లు అర్జున్ ఆవిష్కరించాడు. ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం..

బన్నీ రిలీజ్ చేసిన బ్రేక్ అవుట్
X

దిగ్గజ హాస్య నటుడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో అనిల్ మోదుగ నిర్మిస్తున్న చిత్రం బ్రేక్ అవుట్. బాలకృష్ణ కొండూరి, శ్రీనివాస్ వన్నియాకుల సహ-నిర్మాతలు. సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ను అల్లు అర్జున్ విడుదల చేశాడు.

రెండు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్ లో ఈ చిత్రం కథాంశాన్ని చాలా ఆసక్తికరంగా రివీల్ చేశారు. హీరో అనుకోని పరిస్థితిలో ఒంటరిగా ఒక గ్యారేజ్ లో చిక్కుకుపోతాడు. అతనికి మోనో ఫోబియా అనే మానసిక రుగ్మత ఉంటుంది.

ఈ ఫోబియా ఉన్న వారు ఒంటరిగా ఉండలేరు. తీవ్ర ఆందోళనకు గురవుతారు. గ్యారేజ్ లో ఒంటరిగా చిక్కుకున్న హీరో అక్కడి నుండి బయటపడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు.. మోనో ఫోబియాతో హీరో ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నాడనేది ఈ సినిమా స్టోరీ. అందుకే దీనికి సర్వైవల్ థ్రిల్లర్ అనే పేరు పెట్టారు.

ట్రైలర్ లో రాజా గౌతమ్ యాక్టింగ్ బాగుంది. అతని లుక్, మేకోవర్ ఆకట్టుకున్నాయి. సాంకేతికంగా ట్రైలర్ ఉన్నతంగా ఉంది. జోన్స్ రూపర్ట్ అందించిన నేపధ్య సంగీతం ట్రైలర్ మరో ఆకర్షణగా నిలిచింది. మోహన్ చారీ కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది.



First Published:  31 Aug 2022 4:11 AM GMT
Next Story