Telugu Global
Cinema & Entertainment

Allu Arjun Trivikram - మళ్లీ కలిసిన 'అల వైకుంఠపురములో' కాంబినేషన్

Allu Arjun Trivikram - అల్లు అర్జున్, త్రివిక్రమ్ మరోసారి కలిశారు. సినిమా చేయబోతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Allu Arjun Trivikram - మళ్లీ కలిసిన అల వైకుంఠపురములో కాంబినేషన్
X

అల్లు అర్జున్, త్రివిక్రమ్ ది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరూ కలిశారంటే హిట్ గ్యారెంటీ. ఇది ట్రాక్ రికార్డ్. ఇప్పుడు ఈ ఇద్దరూ మరోసారి కలుస్తున్నారు. మరో కమర్షియల్ ఎఁటర్ టైనర్ ప్లాన్ చేస్తున్నారు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాతగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ ప్రాజెక్టుకు చిన్న హింట్ ఇస్తూ, నిర్మాత నాగవంశీ ఓ ప్రకటన కూడా చేశాడు.

బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటివరకు 3 సినిమాలొచ్చాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో హిట్స్ కొట్టారు వీళ్లిద్దరు. ఇక హ్యాట్రిక్ మూవీగా చేసిన 'అల వైకుంఠపురములో' సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు త్రివిక్రమ్. మ్యూజికల్ గా కూడా ఇది పెద్ద హిట్టయింది.

ఇప్పుడు నాలుగోసారి బన్నీ-త్రివిక్రమ్ కలుస్తున్నారు. త్వరలోనే సినిమాను ఎనౌన్స్ చేస్తారు. పుష్ప-2 సినిమా కంప్లీట్ అయిన వెంటనే త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేస్తాడట బన్నీ. అటు త్రివిక్రమ్, మహేష్ హీరోగా గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నాడు.

First Published:  20 Jun 2023 12:00 PM GMT
Next Story