Telugu Global
Cinema & Entertainment

Pushpa Part 3 | పుష్ప-3 ఉందని ప్రకటించిన బన్నీ

Pushpa Part 3 - ప్రస్తుతం పుష్ప-2 చేస్తున్నాడు అల్లు అర్జున్. పుష్ప-3 కూడా ఆశించొచ్చు అని చెబుతున్నాడు.

Pushpa Part 3 | పుష్ప-3 ఉందని ప్రకటించిన బన్నీ
X

పుష్ప సినిమాకు పార్ట్-3 కూడా రాబోతోందంటూ కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఊహాగానాలపై స్వయంగా హీరో అల్లు అర్జున్ స్పందించాడు. పుష్ప-3 కూడా ఆశించొచ్చు అంటూ ఘనంగా ప్రకటించాడు.

పుష్ప ఫ్రాంచైజీని రెండు సినిమాలతో వదులుకునేందుకు ఇష్టపడడం లేదు బన్నీ. కుదిరితే ఈ ఫ్రాంచైజీని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనను బయటపెట్టాడు. ఇందులో భాగంగా ప్రక్షకులు పార్ట్-3 కూడా ఆశించొచ్చు అని ప్రకటించాడు.

అంతేకాదు, పుష్ప ఫ్రాంచైజీ కోసం ఎన్నో అద్భుతమైన ఆలోచనలున్నాయని తెలిపాడు బన్నీ. తమ ఆలోచనలతో చాలా సీక్వెల్స్ తీయొచ్చని స్పష్టం చేశాడు. ప్రస్తుతం పార్ట్-2 పనిలో బిజీగా ఉన్నాడు ఈ హీరో.

ఆగస్ట్ 15న పుష్ప-2 థియేటర్లలోకి వస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  16 Feb 2024 5:25 PM GMT
Next Story