Telugu Global
Cinema & Entertainment

AAA Cinemas - బన్నీ చేతుల మీదుగా మల్టీప్లెక్స్ లాంఛ్

Allu Arjun AAA Cinemas - అల్లు అర్జున్ సొంత మల్టీప్లెక్స్ AAA సినిమాస్. ఈరోజు బన్నీ చేతుల మీదుగా లాంచ్ అయింది.

AAA Cinemas - బన్నీ చేతుల మీదుగా మల్టీప్లెక్స్ లాంఛ్
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్, అమీర్ పేట్ లోని 'AAA సినిమాస్' ని గ్రాండ్ గా లాంచ్ చేశాడు. ఇది బన్నీకి చెందిన మల్టీప్లెక్స్ అనే విషయం తెలిసిందే. ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో అల్లు అర్జున్ స్వయంగా డబ్బులు పెట్టి ఈ మల్టీప్లెక్స్ నిర్మించాడు. అందుకే దీనికి ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ - 'AAA సినిమాస్' అనే పేరు వచ్చింది.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. గ్రాండ్ గా జరిగిన లాంచింగ్ ఈవెంట్ లో నిర్మాత అల్లు అరవింద్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా తమ అభిమాన హీరో అల్లు అర్జున్ ని చూడటానికి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు.

AAA సినిమాస్ మొత్తం 3 లక్షల చదరపు అడుగుల్లో రూపుదిద్దుకుంది. థర్డ్ ఫ్లోర్ లో35 వేల చదరపు అడుగులు ఫుడ్ కోర్ట్ ఉంది. నాలుగో ఫ్లోర్ AAA సినిమాస్ కు చెందిన 5 స్క్రీన్ లు ఉన్నాయి. స్క్రీన్ నెంబర్ 2 లో ఎల్ఈడీ స్క్రీన్ పెట్టారు. సౌత్ ఇండియాలో ఎల్ఈడీ స్క్రీన్ ఉన్నది AAA సినిమాస్ లోనే. దీనికి ప్రోజక్షన్ ఉండదు. పిక్చర్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అద్భుతమైన అనుభూతి ఇస్తుంది.

ఇక స్క్రీన్-1లో హైదరాబాద్ లోనే బిగ్గర్ స్క్రీన్ ఉన్న మల్టీఫ్లెక్స్ ఉంది. 64 అడుగుల వెడల్పు ఉంది. అద్భుతమైన సౌండ్ క్యాలిటీ ఉంటుంది. లాబీని చాలా లావిష్ గా డిజైన్ చేశారు. ప్రేక్షకులకు ఇది ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.

ఇవి కాకుండా, బన్నీ ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ ఐకానిక్ గ్యాలరీ ఏర్పాటుచేశారు. అందులో బన్నీ అందుకున్న అవార్డులతో పాటు, పలు రకాల వ్యక్తిగత-వృత్తిగత ఫొటోల్ని ఉంచారు. ఇలా సర్వహంగులతో రూపుదిద్దుకుంది AAA సినిమాస్.

First Published:  15 Jun 2023 5:28 PM GMT
Next Story