Telugu Global
Cinema & Entertainment

బ‌న్నీ మ‌రో క్రేజీ రికార్డ్‌.. ఇన్‌స్టాగ్రామ్ ఇంట‌ర్వ్యూ చేసిన తొలి భార‌తీయ న‌టుడు!

ఇన్‌స్టాగ్రామ్ టీమ్‌కు త‌న రోజు ఎలా గ‌డుస్తుందో చెప్పాడు బ‌న్నీ. ఉద‌యం లేవ‌గానే గంట మెడిటేష‌న్ చేసి, లాన్‌లో కాసేపు తిరిగి, కాఫీ తాగుతాన‌ని చెప్పాడు.

బ‌న్నీ మ‌రో క్రేజీ రికార్డ్‌.. ఇన్‌స్టాగ్రామ్ ఇంట‌ర్వ్యూ చేసిన తొలి భార‌తీయ న‌టుడు!
X

బ‌న్నీ మ‌రో క్రేజీ రికార్డ్‌.. ఇన్‌స్టాగ్రామ్ ఇంట‌ర్వ్యూ చేసిన తొలి భార‌తీయ న‌టుడు!

జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డుతో తెలుగు సినిమా చ‌రిత్రలో కొత్త అధ్యాయం లిఖించిన అల్లు అర్జున్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 2 కోట్ల మందికి పైగా ఫాలోవ‌ర్స్ ఉన్న బ‌న్నీకి నేష‌న‌ల్ అవార్డు వ‌చ్చిన సంద‌ర్భాన్ని పురస్క‌రించుకుని ఇన్‌స్టాగ్రామ్ ఆయ‌న‌తో ఓ ఇంట‌ర్వ్యూ ప్లాన్ చేసింది. దీనికోసం హైద‌రాబాద్ వ‌చ్చింది. ఇన్‌స్టాగ్రామ్ ఇంటర్వ్యూ చేసిన తొలి భార‌తీయ న‌టుడు అల్లు అర్జునే అంటూ ఆయ‌న ఫ్యాన్స్ సంబ‌ర‌ప‌డిపోతున్నారు.

దిన‌చ‌ర్య చెప్పి పుష్ప‌-2 సెట్‌కు తీసుకెళ్లాడు

ఇన్‌స్టాగ్రామ్ టీమ్‌కు త‌న రోజు ఎలా గ‌డుస్తుందో చెప్పాడు బ‌న్నీ. ఉద‌యం లేవ‌గానే గంట మెడిటేష‌న్ చేసి, లాన్‌లో కాసేపు తిరిగి, కాఫీ తాగుతాన‌ని చెప్పాడు. షూటింగ్‌లో ఎక్క‌డున్నా మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు ఇంటికిఫోన్ చేసి ఫ్యామిలీతో మాట్లాడ‌తాన‌న్నాడు. త‌ర్వాత ఇన్‌స్టా టీమ్‌ను `పుష్ప‌-2 ది రూల్` సినిమా షూటింగ్ జ‌రుగుతున్న రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకెళ్లాడు. 20 ఏళ్ల నుంచి సుకుమార్ తెలుస‌న్న బ‌న్నీ పుష్ప -2 సినిమా త‌న 20వ సినిమా అని చెప్పాడు.

ఇన్‌స్టాలోనే కాదు.. థ్రెడ్స్‌లోనూ టాపే

ఇన్‌స్టాగ్రామ్‌లో కోట్ల మంది ఫాలోవ‌ర్లున్న అల్లు అర్జున్ అదే కంపెనీ నుంచి వ‌చ్చిన థ్రెడ్‌లోనూ దుమ్ము రేపుతున్నాడు. ట్విట్ట‌ర్‌కు పోటీగా మెటా గ్రూప్ తీసుకొచ్చిన థ్రెడ్స్‌లో 1 మిలియ‌న్ (10 ల‌క్ష‌ల మంది) ఫాలోయ‌ర్లను సంపాదించుకున్న తొలి భార‌తీయ న‌టుడు బన్నీ కావ‌డం సోష‌ల్ మీడియాలో అత‌నికున్న క్రేజ్‌కు నిద‌ర్శ‌నం.

First Published:  30 Aug 2023 6:17 AM GMT
Next Story