Telugu Global
Cinema & Entertainment

చరణ్-అర్జున్ టైటిల్ ఎప్పటికీ నాదే!

దాదాపు 10 ఏళ్ల కిందట ఈ టైటిల్ రిజిస్టర్ చేశారు అల్లు అరవింద్. ఇప్పుడు మరోసారి ఆ మల్టీ స్టారర్ పై స్పందించారు

చరణ్-అర్జున్ టైటిల్ ఎప్పటికీ నాదే!
X

చరణ్-అర్జున్.. ఈ సినిమా టైటిల్ ఎక్కడో విన్నట్టుంది కదా. నిజమే ఇండస్ట్రీలో ఈ టైటిల్ పదేళ్లుగా నలుగుతూనే ఉంది. రామ్ చరణ్ ను, అల్లు అర్జున్ ను హీరోలుగా పెట్టి ఓ పెద్ద మల్టీస్టారర్ చేయాలనేది అల్లు అరవింద్ కల. అందుకే ఈ టైటిల్ ను ఆయన రిజిస్టర్ చేశారు. ఇప్పటికీ అది ఆయన దగ్గరే ఉంది.


"గీతాఆర్ట్స్ బ్యానర్ లో చిరంజీవిగారితోనే ఎక్కువ సినిమాలు చేశాను. నా డ్రీమ్ మాత్రం ఆ బ్యానర్ పై బన్నీ, చరణ్ తో ఓ మల్టీస్టారర్ చేయాలి. అందుకే చరణ్-అర్జున్ అనే టైటిల్ ను పదేళ్ల కిందటే రిజిస్టర్ చేయించాను. ఇప్పటికీ ఆ టైటిల్ నాదే. ప్రతి ఏటా ఆ టైటిల్ ను నేను రెన్యూవల్ చేయిస్తున్నాను. ఎప్పటికైనా వాళ్లిద్దరితో మల్టీస్టారర్ చేస్తా."


ఇలా తన డ్రీమ్ ప్రాజెక్టు బయటపెట్టారు అల్లు అరవింద్. అయితే ఈ డ్రీమ్ మల్టీస్టారర్ కు సంబంధించి ఇంకా ఎలాంటి పనులు మొదలుపెట్టలేదంటున్నారు అరవింద్. ఎలాంటి కథలు వినలేదని, ఎవరైనా మంచి కథతో వస్తే వినడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.


తన కెరీర్ లో బాగా రిస్క్ చేసిన సినిమాగా మగధీరను చెప్పుకొచ్చారు అరవింద్. అనుకున్న బడ్జెట్ కంటే 80శాతం ఎక్కువగా ఆ సినిమాకు ఖర్చు పెట్టామని, తన ఆస్తులు మొత్తం ఆ సినిమాపై పెట్టానని అన్నారు. అలా భారీ రిస్క్ చేసి తీసిన మగధీర సినిమా తనకు 3 రెట్లు లాభాలు అందించిందన్నారు. అందుకే తన కెరీర్ లో మగధీరనే ఎక్కువగా ఇష్టపడతానంటున్నారు ఈ మెగా ప్రొడ్యూసర్.

First Published:  18 Oct 2022 12:12 PM GMT
Next Story