Telugu Global
Cinema & Entertainment

Bachachala Malli | అల్లరి నరేష్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్

Bachachala Malli - అల్లరి నరేష్ కొత్త సినిమాకు బచ్చల మల్లి అనే టైటిల్ పెట్టారు. ఇదొక పీరియాడిక్ సినిమా.

Bachachala Malli | అల్లరి నరేష్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్
X

హీరో అల్లరి నరేష్ తన 63 వ చిత్రం కోసం సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ దర్శకుడు సుబ్బు తో చేతులు కలిపాడు. బ్లాక్ బస్టర్ 'సామజవరగమనా' చిత్రాన్ని అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ రోజు, మేకర్స్ టైటిల్‌ ఎనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి 'బచ్చల మల్లి' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. టైటిల్ పోస్టర్‌లో పూర్తిగా లోడ్ చేయబడిన ట్రాక్టర్ లోయలో పడిపోతున్నట్లు కనిపిస్తోంది. ట్రాక్టర్‌పై టైటిల్ రాసి ఉంది. టైటిల్ పోస్టర్ ద్వారా సినిమాలో యాక్షన్‌ ఎక్కువగా ఉంటుందని అర్ధమౌతోంది

బచ్చల మల్లి ఈరోజు గ్రాండ్ గా లాంచ్ అయింది. అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో సూచించినట్లుగా, న్యూ -ఏజ్ యాక్షన్ డ్రామాగా యూనిక్ కథతో ఈ చిత్రం రూపొందుతోంది. అల్లరి నరేష్ పూర్తిగా కొత్త లుక్ లో కనిపించనున్నాడు.

అల్లరి నరేష్ కు జోడిగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్, సాయి కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

భారీ స్థాయిలో రూపొందనున్న ‘బచ్చల మల్లి’లో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ‘సీతారామం’ ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, మానాడు, రంగం, మట్టి కుస్తి చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం 1990 బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది.




First Published:  1 Dec 2023 4:38 PM GMT
Next Story