Telugu Global
Cinema & Entertainment

Aa Okkati Adakku | క్లాసిక్ టైటిల్ తో అల్లరి నరేష్

Aa Okkati Adakku - ఈవీవీ దర్శకత్వంలో వచ్చిన ఎవర్ గ్రీన్ కామెడీ 'ఆ ఒక్కటి అడక్కు'. ఇప్పుడీ టైటిల్ ను తనయుడు అల్లరి నరేష్ వాడేస్తున్నాడు.

Aa Okkati Adakku | క్లాసిక్ టైటిల్ తో అల్లరి నరేష్
X

అల్లరోడు ఈజ్ బ్యాక్. అల్లరి నరేష్ తన గత కొన్ని సినిమాల్లో సీరియస్ గా కనిపించాడు. అన్నీ సీరియస్ సబ్జెక్టులో చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు తన ప్రధాన బలమైన కామెడీ జానర్ వైపు వచ్చాడు.

తన 61వ సినిమా కోసం డెబ్యు డైరెక్టర్ మల్లి అంకంతో చేతులు కలిపాడు అల్లరి నరేష్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు.

ఈ రోజు, మేకర్స్ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల చేసారు. అల్లరి నరేష్ తండ్రి ఈవీవీ సత్యనారాయణ కెరీర్ లో ఎపిక్ హిట్ గా నిలిచిన చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు', ఈ పేరుని ఈ చిత్రానికి టైటిల్ గా పెట్టారు. అల్లరి నరేష్ పాత్రను పరిచయం చేయడంతో పాటు, సినిమా గ్లింప్స్ ఆసక్తికరంగా పరిచయం చేశారు.

అల్లరి నరేష్ పాత్ర పేరు గణ, అతని పెళ్లి గురించి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు అడుగుతారు. టైటిల్‌ను రివిల్ చేస్తూ “ఆ ఒక్కటీ అడక్కు…” అని వారికి సమాధానమిచ్చాడు. పెళ్లి అనేది పాన్ ఇండియా సమస్య అని చెప్తాడు, అయితే సినిమా తెలుగులో మాత్రమే విడుదల అవుతుంది.


ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, జానీ లీవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

అబ్బూరి రవి రైటర్ గా, గోపీసుందర్ మ్యూజిక్ డైరక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 22న విడుదల చేయబోతున్నారు.

First Published:  16 Feb 2024 5:14 PM GMT
Next Story