Telugu Global
Cinema & Entertainment

Itlu Maredumilli Prajaneekam: అల్లరి నరేష్ సినిమా వాయిదా

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

Itlu Maredumilli Prajaneekam: అల్లరి నరేష్ సినిమా వాయిదా
X

హీరో అల్లరి నరేష్ తాజా చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. టీజర్ తో ఈ సినిమా ఆసక్తిని పెంచింది. ఈ టీజర్‌ కు, ఆల్రెడీ రిలీజైన మెలోడీ సాంగ్‌ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ తో కలిసి హాస్య మూవీస్‌ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నాడు.

గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా అల్లరి నరేష్‌ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. ఈ సినిమా విడుదల కొంచెం ఆలస్యమౌతుంది. నవంబర్ 11న కాకుండా 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది.

ఈ సందర్భంగా మరో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో గిరిజన ప్రాంతంలో పోలీసు అధికారులతో జీపులో ప్రయాణిస్తూ సీరియస్ గా కనిపిస్తున్నాడు అల్లరి నరేష్.

ఆనంది హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. రాంరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. అబ్బూరి రవి మాటలు అందిస్తున్నాడు.

First Published:  6 Nov 2022 4:27 AM GMT
Next Story