Telugu Global
Cinema & Entertainment

Bachalamilli | అల్లరి నరేష్ సినిమా షూటింగ్ అప్ డేట్స్

Bachalamilli Movie - ఓవైపు ఆ ఒక్కటి అడక్కు సినిమా చేస్తూనే, మరోవైపు బచ్చల మల్లి అనే సినిమా పూర్తి చేస్తున్నాడు అల్లరి నరేష్.

Bachalamilli | అల్లరి నరేష్ సినిమా షూటింగ్ అప్ డేట్స్
X

హీరో అల్లరి నరేష్ 'బచ్చల మల్లి' చిత్రం కోసం సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ దర్శకుడు సుబ్బు మంగాదేవితో కలిసి వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ 'సామజవరగమనా' చిత్రాన్ని అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న్యూ -ఏజ్ యాక్షన్ డ్రామాగా సరికొత్త కథతో రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రధాన తారాగణంపై సినిమాలోని చాలా ముఖ్యమైన సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో చిత్రీకరించారు.

అల్లరి నరేష్ కు జోడిగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కోట జయరామ్, రావు రమేష్, సాయి కుమార్, ధనరాజ్, హరితేజ లాంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

భారీ స్థాయిలో రూపొందనున్న ‘బచ్చల మల్లి’లో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ‘సీతారామం’ ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, మానాడు, రంగం, మట్టి కుస్తి చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

First Published:  5 March 2024 5:12 PM GMT
Next Story