Telugu Global
Cinema & Entertainment

Bachalamalli | బచ్చలమల్లి షూటింగ్ అప్ డేట్స్

Bachala malli - ఓవైపు 'ఆ ఒక్కటి అడక్కు' సినిమాను విడుదలకు సిద్ధం చేసిన అల్లరి నరేష్, మరో సినిమాను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.

Bachalamalli | బచ్చలమల్లి షూటింగ్ అప్ డేట్స్
X

హీరో అల్లరి నరేష్ 'బచ్చల మల్లి' చిత్రం కోసం సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ దర్శకుడు సుబ్బు మంగాదేవితో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ 'సామజవరగమనా' చిత్రాన్ని అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న్యూ -ఏజ్ యాక్షన్ డ్రామాగా సరికొత్త కథతో రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా ఓ కీలక షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రధాన తారాగణంపై సినిమాలోని చాలా ముఖ్యమైన సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో చిత్రీకరించారు. ఈ మూవీకి సంబంధించి కీలకమైన అప్ డేట్ వచ్చింది. మే 10 నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఉంటుంది. ఈసారి ఇక గ్యాప్స్ ఇవ్వరంట. పూర్తిగా షూటింగ్ అయ్యేవరకు సింగిల్ షెడ్యూల్ లో ఇది కొనసాగుతుందంట.

అలా బచ్చల మిల్లి సినిమా షూటింగ్ ను పూర్తిచేస్తామని రాజేష్ ప్రకటించాడు. 90వ దశకం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సహజమైన లొకేషన్లలో షూట్ చేస్తున్నారు. ఎక్కువగా అన్నవరం, తుని, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారు. సినిమాలో

అల్లరి నరేష్ కు జోడిగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కోట జయరామ్, రావు రమేష్, సాయి కుమార్, ధనరాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

భారీ స్థాయిలో రూపొందనున్న ‘బచ్చల మల్లి’లో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ‘సీతారామం’ ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, మానాడు, రంగం, మట్టికుస్తి చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దర్శకుడు సుబ్బు ఈ కథను రాసుకున్నాడు, డైలాగ్స్ కూడా అతడే సమకూరుస్తున్నాడు.

First Published:  20 March 2024 1:41 AM GMT
Next Story