Telugu Global
Cinema & Entertainment

Allari Naresh: అందుకే సోషల్ మీడియాకు దూరం

Allari Naresh: సోషల్ మీడియాకు తను దూరం అంటున్నాడు అల్లరి నరేష్. తన వ్యక్తిగత విషయాలు బయటపెట్టాల్సిన అవసరం లేదంటున్నాడు.

Allari Naresh
X

Allari Naresh: అందుకే సోషల్ మీడియాకు దూరం

హీరోహీరోయిన్లంతా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో కనిపిస్తారు. లేటెస్ట్ అప్ డేట్స్ పెడుతుంటారు. కానీ అల్లరి నరేష్ మాత్రం సోషల్ మీడియాకు దూరం. ఇప్పటికీ తను మారలేదంటున్నాడు ఈ హీరో.

"సోషల్ మీడియాను ఫాలో అవుతాను. కానీ నేను పోస్టులు పెట్టను. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాకు కాస్త దూరంగానే ఉంటాను, తక్కువగా వాడతాను. జనాలకు నేను చేసే సినిమాల గురించి చెబితే సరిపోతుంది. నేను ఏం తిన్నాను, ఎక్కడ కూర్చున్నాను లాంటివి అక్కర్లేదని నా ఫీలింగ్."

Advertisement

వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేటుగా గడపడానికి ఇష్టపడతానని ప్రకటించాడు అల్లరి నరేష్. అందుకే ఎలాంటి ఫొటోలు షేర్ చేయనని, అవన్నీ తన మొబైల్ లో ఉంటాయని అన్నాడు.

"వ్యక్తిగత జీవితానికి, వృత్తి జీవితానికి మధ్య చాలా గ్యాప్ ఇస్తాను. నేను ఫ్యామిలీ పరంగా చాలా ప్రైవేట్ పర్సన్ ని. నేను కుటుంబంతో చాలా ఎంజాయ్ చేస్తాను. చాలా టూర్లకు వెళ్తాను. ఫొటోలు తీసుకుంటాను, కానీ అవన్నీ నా ఫోన్ లోనే ఉంటాయి. పోస్ట్ చేయను. అవి నా మెమొరీస్ మాత్రమే, ప్రేక్షకులకు అక్కర్లేదు."

అల్లరి నరేష్ తాజా చిత్రం ఉగ్రం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వచ్చేనెల థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు అల్లరోడు.

Next Story