Telugu Global
Cinema & Entertainment

Sankranti Movies | సంక్రాంతి సినిమాల సందడి షురూ

Sankranti Movies - సంక్రాంతి సినిమాల సందడి షురూ అయింది. ముందుగా గుంటూరుకారం, హను-మాన్ థియేటర్లలోకి వచ్చాయి. మరో 2 వెయిటింగ్.

Sankranti Movies | సంక్రాంతి సినిమాల సందడి షురూ
X

ఎట్టకేలకు సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ రద్దీ కనిపిస్తోంది. థియేటర్ల బయట హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో భారీ పోటీ కనిపిస్తోంది.

గుంటూరుకారం, హనుమాన్ సినిమాలతో సంక్రాంతి బాక్సాఫీస్ పోటీ మొదలైంది. ఈ రెండు సినిమాలు భారీ ఎత్తున థియేటర్లలోకి వచ్చాయి. గుంటూరుకారం సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 10 కోట్లు ఆర్జించింది. ఈ సినిమాకు ప్రారంభ టాక్ కూడా బాగుంది.

మహేష్ హీరోగా నటించిన ఈ సినిమా, సంక్రాంతి బరిలో అతిపెద్ద సినిమాగా నిలిచింది. సంక్రాంతి బరిలో భారీ రిలీజ్ ఈ మూవీకే దక్కింది. హైదరాబాద్ లో రికార్డ్ స్థాయిలో ఈ సినిమా రిలీజైంది. అటు ఓవర్సీస్ లో కూడా ఇది దుమ్ముదులుపుతోంది.

ఇక గుంటూరుకారంతో పాటు వచ్చిన హనుమాన్ కు థియేటర్లు తక్కువగా దొరికినప్పటికీ, ప్రీమియర్ షోలతో అదరగొట్టింది. ప్రీమియర్స్ తో ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. అటు బాలీవుడ్ నుంచి హనుమాన్ కు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మరికొన్ని గంటల్లో హనుమాన్ పూర్తి రిజల్ట్ బయటకు రాబోతోంది.

ఒక రోజు గ్యాప్ లో వెంకీ సైంధవ్ కూడా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాను కూడా కొంతమంది ఇండస్ట్రీ జనాలు చూశారు. సినిమాలో యాక్షన్ ఎంత ఉందో, ఎమోషన్ కూడా అంతే ఉందని, ఏమాత్రం క్లిక్ అయినా సైంధవ్ ను ఆపడం ఎవ్వరితరం కాదనేది ఇన్ సైడ్ టాక్.

ఇక సంక్రాంతి బరిలో చివరిగా వస్తున్న సినిమా నా సామిరంగ. నాగ్ హీరోగా నటించిన ఈ సినిమాను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఏరికోరి మరీ నాగార్జున సంక్రాంతికి వస్తున్నాడంటే, ఈ సినిమాపై అతడికున్న నమ్మకం అర్థం చేసుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే, కంటెంట్ పరంగా సిసలైన సంక్రాంతి మూవీ ఇదే.

First Published:  11 Jan 2024 5:05 PM GMT
Next Story