Telugu Global
Cinema & Entertainment

Kiara Advani: కియరా పెళ్లికి భారీ ఏర్పాట్లు

Kiara advani marriage - స్టార్ హీరోయిన్ కియరా అద్వానీ పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి

Kiara Advani: కియరా పెళ్లికి భారీ ఏర్పాట్లు
X

హీరోయిన్ కియరా అద్వానీ పెళ్లికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 6వ తేదీన నటుడు సిద్దార్థ్ మల్హోత్రను ఈ ముద్దుగుమ్మ పెళ్లాడబోతోంది. 4వ తేదీ, అంటే రేపట్నుంచి ఈ పెళ్లి వేడుక మొదలవుతుంది. పెళ్లికి సంబంధించి జైసల్మేర్ లోని స్టార్ హోటల్ రిసార్ట్ లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు సాయంత్రమే జైసల్మేల్ బయల్దేరుతుంది కియరా.

జైసల్మేర్ లోని అత్యంత ఖరీదైన ఫైవ్ స్టార్ హోటల్ రిసార్ట్ ను ఈ జంట, తమ పెళ్లి కోసం బుక్ చేసింది. ఈ హోటల్ లో ఒక రాత్రి స్టే చేయాలంటే 60వేల నుంచి 70వేల రూపాయల మధ్య ఖర్చు అవుతుంది. అలాంటి హోటల్ లోని గదులన్నింటినీ కియరా-సిద్దార్థ్ కలిసి బుక్ చేశారు.

ఈ పెళ్లికి దాదాపు 120 మంది అతిథులు హాజరవుతున్నారు. అందర్నీ ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్ కు తీసుకొచ్చేందుకు లగ్జరీ కార్లు ఏర్పాటుచేశారు. పెళ్లికి సంబంధించి ఇప్పటికే అతిధులు హోటల్ కు చేరుకుంటున్నారు.

హిందూ సంప్రదాయంలో కియరా-సిద్దార్థ్ పెళ్లి చేసుకోబోతున్నారు. ముందుగా హల్దీ ఫంక్షన్, ఆ తర్వాత మెహందీ ఫంక్షన్, ఆ తర్వాత సంగీత్ ఫంక్షన్ నిర్వహిస్తారు. పెళ్లికి వచ్చే అతిథులకు వడ్డించేందుకు భారతీయ రుచులతో పాటు కాంటినెంటల్ స్పెషల్స్ ను కూడా సిద్ధం చేశారు.

First Published:  3 Feb 2023 10:40 AM GMT
Next Story