Telugu Global
Cinema & Entertainment

Alia Bhatt: కూతురు పేరు ప్రకటించిన అలియాభట్

Alia Bhat-Ranbir Kapoor: తమ కూతురికి ఈ సెలబ్రిటీ కపుల్ ఓ డిఫరెంట్ పేరు పెట్టారు. ఆ పేరుకు పలు భాషల్లో పలు అర్థాలున్నాయి.

Alia Bhatt: కూతురు పేరు ప్రకటించిన అలియాభట్
X

హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ అలియాభట్ దంపతులకు ఇటీవల ఆడ బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. దీంతో కపూర్ కుటుంబంలో ఆనందం వెల్లివెరిసింది. ఇప్పుడా పాపకు పేరు కూడా పెట్టారు. రణబీర్-అలియా కూతురు పేరు రహా.

ఈ పేరు పెట్టింది అలియాభట్ కాదు. తన కూతురుకు ఎంతో రీసెర్చ్ చేసి మరీ ఈ పేరు పెట్టాడు రణబీర్ కపూర్. ఈ విషయాన్ని అలియాభట్, సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కూతురుకు పేరు పెట్టే బాధ్యతను పూర్తిగా తన భర్త రణబీర్ తీసుకున్నాడని, ఈ విషయంలో తన ప్రమేయం లేదని వెల్లడించింది.

ఈ సందర్భంగా రహా అనే పేరుకు అర్థాన్ని కూడా బయటపెట్టింది అలియా భట్. రహా అంటే సంస్కృతంలో వంశం అని అర్థం వస్తుందట. ఇక అరబిక్ లో ఈ పదానికి శాంతి, సౌభ్రాతృత్వం అనే అర్థాలున్నాయంట. బంగ్లా భాషలో రహా అంటే ప్రశాంతత అని అర్థం అంట.

అందుకే తమ పాపకు ఈ మంచి పేరు పెట్టినట్టు వెల్లడించింది అలియాభట్. అయితే ఈ పేరుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది హిందూ పేరుగా అనిపించడం లేదని, మరో వర్గానికి చెందిన పేరుగా అనిపిస్తోందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
Next Story