Telugu Global
Cinema & Entertainment

Kannappa | పని పూర్తిచేసిన అక్షయ్ కుమార్

Kannappa - కన్నప్ప సినిమాకు సంబంధించి తన పని పూర్తిచేశాడు అక్షయ్ కుమార్. 2 వారాల కాల్షీట్లు పూర్తయ్యాయి.

Kannappa | పని పూర్తిచేసిన అక్షయ్ కుమార్
X

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఈ ప్రాజెక్టులో దిగ్గజ నటులు భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం వంటి వారు నటిస్తున్నారు.

రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా షూటింగ్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అక్షయ్ కుమార్ తన సీన్లకు సంబంధించిన షూటింగ్‌ పూర్తి చేశారు. ఈ మేరకు అక్షయ్ కుమార్‌తో పని చేసిన ఎక్స్‌పీరియెన్స్ గురించి విష్ణు మంచు తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

అక్షయ్ కుమార్ కొద్ది రోజుల క్రితం కన్నప్ప షూటింగ్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ తన షూటింగ్‌ను ముగించాడు. విష్ణు మంచు ఈ మేరకు వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘అక్షయ్‌కుమార్‌ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైంది. ఇంకా ఇలా ఎన్నో సార్లు కలవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

మహాశివరాత్రి పర్వదినాన విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్క అప్డేట్‌తో కన్నప్ప మీద అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అనేక మంది పాన్ ఇండియా స్టార్స్ ఉండటం వల్ల అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్ మీద పడింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి ప్రభాస్ వస్తున్నాడు.

First Published:  4 May 2024 7:45 AM GMT
Next Story