Telugu Global
Cinema & Entertainment

నాగ్, అల్లరి నరేష్ హీరోలుగా మల్టీస్టారర్

ఈ సినిమా ద్వారా ప్రముఖ రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. రచయితగా వరుస విజయాలు అందుకున్న ప్రసన్నకుమార్ నాగార్జున కోసం పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో కథను సిద్ధం చేశారు.

నాగ్, అల్లరి నరేష్ హీరోలుగా మల్టీస్టారర్
X

తెలుగులో ఇటీవల కాలంలో మల్టీస్టారర్ల సంఖ్య బాగా పెరిగింది. గతేడాది మల్టీస్టారర్లుగా వచ్చిన ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, ఈ ఏడాది ప్రారంభంలో వ‌చ్చిన వాల్తేరు వీర‌య్య‌ సినిమాలు ఘన విజయం సాధించాయి. ఈ ఏడాది కూడా తెలుగులో మరిన్ని మల్టీస్టారర్లు రాబోతున్నాయి. తాజాగా మరోసారి కొత్త మల్టీస్టారర్ కు రంగం సిద్ధమైంది. సీనియర్ హీరో నాగార్జున, యంగ్ హీరో అల్లరి నరేష్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది.

ఈ సినిమా ద్వారా ప్రముఖ రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. రచయితగా వరుస విజయాలు అందుకున్న ప్రసన్నకుమార్ నాగార్జున కోసం పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో కథను సిద్ధం చేశారు. నాగార్జున కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ది ఘోస్ట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న నాగార్జున ఈ సినిమాను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించి ఫాస్ట్ గా ఫినిష్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూవీని శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు. కాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారు.

First Published:  18 Feb 2023 2:35 AM GMT
Next Story